పాపం… అల్లరినరేష్…

untitled-9

భర్తకు విడాకులిస్తే క్రేజ్ తగ్గిపోతుంది కాబట్టి సదరు హీరోయిన్ తన సరసన నటించేస్తుందనే భ్రమలో అల్లరినరేష్ ఉన్నాడు. కానీ అమలాపాల్ మాత్రం అల్లరోడికి గట్టిదెబ్బే కొట్టింది. అతడి సినిమాల్లో నటించే ఛాన్స్ లేదని తెగేసి చెప్పేసింది. భర్త ఎ.ఎల్ విజయ్ నుంచి విడాకులు తీసుకున్న తర్వాత… టాలీవుడ్ నుంచి అమలాపాల్ కు వచ్చిన మొదటి ఆఫర్ అల్లరోడిదే. కానీ అమలాపాల్ మాత్రం అంతకుమించి ఎక్స్ పెక్ట్ చేస్తోంది. అందుకే అల్లరోడికి హ్యాండ్ ఇచ్చింది.

ఓవైపు బిగ్ షాట్స్ ను ఎట్రాక్ట్ చేసేందుకు హాట్ హాట్ ఫొటోషూట్స్ రిలీజ్ చేస్తుంటే… అల్లరినరేష్ లాంటి హీరోలు తనను ఎప్రోచ్ అవ్వడంతో అమలాపాల్ కు చిర్రెత్తుకొచ్చిందట. మరీ మహేష్ బాబు, పవన్ కల్యాణ్ కాకపోయినా.. ఓ మోస్తరు సరుకున్న హీరోలు తనకు ఆఫర్లు ఇస్తారని ఎదురుచూస్తుంటే.. అల్లరినరేష్ తనకు ఆఫర్ ఇవ్వడానికి జీర్ణించుకోలేకపోయింది అమలాపాల్. అందుకే ప్రస్తుతం చేతిలో ఆఫర్లు లేకపోయినా.. అల్లరోడి ఆఫర్ ను రిజెక్ట్ చేసింది.

ప్రస్తుతానికైతే అమలాపాల్ కు తెలుగు నుంచి ఎలాంటి పిలుపు లేదు. అటు దర్శకుడు పూరి జగన్నాధ్ తో మాత్రం ఈ పిల్ల ఫుల్ టచ్ లో ఉంది. వీలైతే పూరీనే ఈమెను ఆదుకుంటాడేమో చూడాలి. మెగా కాంపౌండ్ పెద్దలతో చర్చలు సాగించినప్పటికీ.. అటు నుంచి అంత పాజిటివ్ రెస్పాన్స్ రాలేదని తెలుస్తోంది.

Loading...

Leave a Reply

*