విధి విచిత్రం… అల్లరోడి సరసన మెగా హీరోయిన్

untitled-9

తెలుగులో అమలాపాల్ కు మెగాహీరోయిన్ అనే ట్యాగ్ లైన్ ఉంది. ఎందుకంటే.. బన్నీ సరసన ఇద్దరమ్మాయిలతో సినిమా చేసింది. అంతకంటే ముందు చెర్రీ సరసన నాయక్ సినిమాలో మెరిసింది. ఈ రెండు సినిమాల్లో బన్నీ, చెర్రీ సరసన పర్ ఫెక్ట్ గా సూటైంది. అంతకుముందు బెజవాడ లాంటి సినిమాలు చేసినప్పటికీ… అమలాపాల్ కు మెగా హీరోయిన్ గానే మంచి గుర్తింపు ఉంది. అలాంటి భామ ఇప్పుడు అల్లరోడు సరసన నటించడానికి కూడా రెడీ అయిపోతోందట. విధి విచిత్రం అంటే ఇదే.పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాలు తగ్గించేసింది అమలాపాల్. అలా అని వైవాహిక జీవితంలో కూడా సెట్ అవ్వలేదు.

దర్శకుడు ఏఎల్ విజయ్ తో విడాకులు తీసుకుంది. అనుకున్నదే తడవుగా విడాకులైతే తీసుకుంది కానీ.. తిరిగి ఆఫర్లు సంపాదించడం మాత్రం కష్టంగా మారింది. తనలో ఇంకా అది తగ్గలేదని చూపించడం కోసం ఈమధ్య రెండు హాట్ ఫొటో షూట్లు కూడా వదిలింది. పాపం.. ఆ హాట్ నెస్ కూడా తెలుగు స్టార్స్ ను కదిలించలేకపోయింది. ఇక చేసేదేం లేక ఎవరైనా ఓకే అనేస్తోందట.అందుకే మెగా హీరోయిన్ స్థాయి నుంచి ఇప్పుడు అల్లరి నరేష్ సినిమాలో నటించడానికి కూడా అమలాపాల్ రెడీ అయిపోతోందట.

నిజానికి ఓ మోస్తరు క్రేజ్ ఉన్న ఏ హీరోయిన్ అల్లరోడి సినిమాల్లో నటించడానికి ఇష్టపడదు. అందుకే ఎప్పటికప్పుడు కొత్త హీరోయిన్లను వెదుక్కుంటాడు అల్లరినరేష్. కానీ ఈసారి అమలాపాల్ తో సినిమాకు రెడీ అయిపోతున్నాడట. అల్ల‌రి న‌రేష్ తో అలా ఎలా ద‌ర్శ‌కుడు అనీష్ కృష్ణ ఒక చిత్రం చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.మ‌ల‌యాళంలో మంచి విజ‌యం అందుకున్న ఒరు ఒడ‌క్క‌న్ సెల్ఫీ చిత్రానికి ఇది రీమేక్. బొప్ప‌న్న చంద్ర శేఖ‌ర్ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. క‌థా నాయికగా అమ‌లాపాల్ పేరు ప‌రిశీలిస్తున్న‌ట్లు తెలుస్తోంది.

Loading...

Leave a Reply

*