మరోసారి పరశురాంతోనే….

untitled-71

శ్రీరస్తు శుభమస్తు సినిమాతో కెరీర్ లోనే మొట్టమొదటి కమర్షియల్ హిట్ అందుకున్నాడు అల్లు శిరీష్. ఈ సినిమా తర్వాత శిరీష్ కు చాలా ఆఫర్లు వచ్చాయి. కానీ వాటిలోంచి ఏరికోరి ఓ సినిమాను సెలక్ట్ చేసుకున్నాడు. అదే ఎమ్ వీ ఎన్ రెడ్డి దర్శకత్వంలో సినిమా. శైలేంద్ర ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎమ్ వీ ఎన్ రెడ్డి దర్శకత్వంలో ఆ సినిమా చేయబోతున్నట్టు శిరీష్ ప్రకటించాడు. అయితే తాజాగా ఆ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నాడు కూడా.సినిమాలో ఎక్కువ భాగం గ్రాఫిక్స్, యాక్షన్ సన్నివేశాలు ఉన్నాయట. ఇందుకోసం ఆరు నెలలకు పైనే ప్రీ ప్రొడక్షన్ పట్టే సూచనలు కనిపిస్తూ ఉండడంతో అప్పటివరకూ ఎవరికి వారు వేరే ప్రాజెక్టులు చేసుకోవాలని నిర్ణయించుకున్నారట.

ఇదే స్క్రిప్ట్‌తో సినిమా తప్పకుండా ఉంటుందని కూడా శిరీష్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. కృష్ణగాడి వీరప్రేమగాథలో మెరిసిన మెహ్రీన్ ఇందులో హీరోయిన్ గా ఫిక్స్ అయింది.తాజా సమాచారం ప్రకారం… ఎమ్ వీ ఎన్ రెడ్డి దర్శకత్వంలో సినిమా పట్టాలపైకి వచ్చేలోపు పరశురాంతోనే మరో సినిమా కంప్లీట్ చేయాలనే ఆలోచనతో అల్లు శిరీష్ ఉన్నట్టు తెలుస్తోంది. మెగా కాంపౌండ్ లోనే మరో సినిమా చేసేందుకు పరశురాం ఇప్పటికే అడ్వాన్స్ తీసుకున్నాడు. కథ కూడా సిద్దం చేశాడట. సో.. శిరీష్ తోనే మరో సినిమా చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

Loading...

Leave a Reply

*