ప‌వ‌న్‌తో పెట్టుకుంటున్న అల్లు అర్జున్‌… స‌మ‌రానికి సై..?

untitled-3-copy

చెప్పను బ్రదర్ అనగానే ఎవరికైనా బన్నీ గుర్తొస్తాడు. ఆ డైలాగ్ మామూలుగా ట్రెండ్ కాలేదు. నిజానికి అది సినిమా డైలాగ్ కాదు. బన్నీ రియల్ లైఫ్ డైలాగ్. ఆ ఒకే ఒక్క డైలాగ్ తో వరల్డ్ వైడ్ దాదాపు వారం రోజుల పాటు ట్రెండ్ అయి కూర్చున్నాడు అల్లు అర్జున్. ఆ డైలాగ్ ట్రెండింగ్ ఇప్పుడు కాస్త తగ్గింది… అయితే డైలాగ్ వెనక కోల్డ్ వార్ మాత్రం ఇంకా కొనసాగుతోంది. అవును.. పవన్ గురించి అప్పట్లో చెప్పను బ్రదర్ అన్న బన్నీ.. ఇప్పటికీ అదే మైండ్ సెట్ తో ఉన్నాడట.

పవన్ గురించి ఒక్క ముక్క కూడా మాట్లాడనని ఓపెన్ గా నే ప్రకటించాడు బన్నీ. నిహారిక సినిమా ఆడియో ఫంక్షన్ లో ఫ్యాన్స్ పై ఓ రేంజ్ లో విరుచుకుపడ్డాడు. దీంతో పవన్ ఫ్యాన్స్ బన్నీకి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో చాలా హంగామా చేశారు. ఇంకా చెప్పాలంటే బన్నీ నెక్ట్స్ సినిమాల్ని బ్యాన్ చేయడానికి పవన్ ఫ్యాన్స్ రెడీగా ఉన్నారు. అయితే ఇంతలోనే అతడు కాస్త తగ్గుతాడేమోనని కూడా ఫ్యాన్స్ వెయిట్ చేశారు. కానీ బన్నీ తగ్గలేదు. ఇంకాస్త రెచ్చిపోయాడు.

తాజాగా కాటమరాయుడు ఫస్ట్ లుక్ విడుదలైంది. ఆ సినిమా ఫస్ట్ లుక్ చాలా బాగుందని చెర్రీ ప్రకటించాడు. దాదాపు మెగా కాంపౌండ్ మొత్తం రెస్పాండ్ అయింది. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉండే బన్నీ మాత్రం ఆ రోజు సైలెంట్ అయిపోయాడు. ఇదేంటి అనడిగితే మరోసారి చెప్పను బ్రదర్ అంటున్నాడు. కోల్డ్ వార్ కంటిన్యూస్…

Loading...

Leave a Reply

*