ఇత‌డే.. దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్‌..!

bunny

అల్లు అర్జున్ న‌టిస్తున్న లేటెస్ట్ మూవీ దువ్వాడ జ‌గ‌న్నాధం. గ‌బ్బ‌ర్‌సింగ్ ఫేమ్ హ‌రీష్ శంక‌ర్ ఈ మూవీ డైరెక్టర్‌. పూజా హెగ్డే క‌థానాయిక‌. బ‌న్ని అంటే స్ట‌యిలిష్ స్టార్‌. ఆయ‌న ప్రతి మూవీలోనూ ఓ న్యూ మేకోవ‌ర్‌లో క‌నిపిస్తాడు. గంగోత్రి నుంచి నిన్న‌టి స‌రైనోడు వ‌రకు అల్లు అర్జున్ సినిమాకో కొత్త అవ‌తారంలో క‌నిపించాడు. అదే ఆయ‌న సక్సెస్ సీక్రెట్‌. సౌత్ ఇండియాలో బ‌న్నికి ఓ ఇమేజ్‌ని తెచ్చి పెట్టిన అంశాల‌లో ఆయ‌న స్ట‌యిల్ ఒక‌టి.అందుకే, సెట్స్‌పైకి వ‌చ్చిన లేటెస్ట్ మూవీ దువ్వాడ జ‌గ‌న్నాథంలోనూ ఓ కొత్త లుక్‌ని ట్రై చేస్తున్నాడ‌ట బ‌న్ని. ఇదే ఆ మేకోవ‌ర్ అంటూ సోష‌ల్ మీడియాలో కొన్ని ఫోటోలు హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. ఈ సినిమాలో రేడియో జాకీగా క‌నిపిస్తాడు. ఈ లుక్ కోసం హ‌రీష్ శంక‌ర్‌-బ‌న్ని ఎన్నో స్ట‌యిల్స్‌ను ఫాలో అయ్యార‌ట‌.

అంతేకాదు, ఎంద‌రో స్ట‌యిలిస్ట్‌ల‌ను కూడా సంప్ర‌దించార‌ట. ఫైన‌ల్‌గా ఈ అవ‌తార్ అయితే బావుంటుంద‌ని దీనికి ఫిక్స్ అయ్యార‌ని స‌మాచారం.హీరోల‌ను కొత్త‌గా ప్రెజెంట్ చెయ్య‌డంలో హ‌రీష్‌ది తిరుగులేని హ్యాండ్‌. గ‌బ్బ‌ర్‌సింగ్‌తో ప‌వ‌న్ కెరీర్‌ని ప‌ట్టాలెక్కించాడు. ఆయ‌న‌కు సెకండ్ ఇన్నింగ్స్ షురూ చేశాడు. రామ‌య్యా వ‌స్తావ‌య్యా చిత్రం యావ‌రేజ్‌గా నిలిచినా.. తార‌క్‌ని రొమాంటిక్ హీరోగా ఆవిష్క‌రించాడు. ఇక‌, సుబ్ర‌మ‌ణ్యం ఫ‌ర్ సేల్ మూవీలో సాయిధ‌ర‌మ్ తేజ్‌ని మ‌రో న్యూ యాంగిల్‌లో చూపించాడు. అయితే, ఈ ముగ్గురికంటే బన్ని డిఫ‌రెంట్‌. అందుకే, బ‌న్నికి ఈ స్ట‌యిల్ సెట్ చేశాడ‌ట‌. స్ట‌యిలిష్ స్టార్ దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్ లుక్‌పై ఇప్ప‌టికే మంచి మార్కులు ప‌డుతున్నాయి. మ‌రి, ఇది నిజ‌మో కాదో తేలాలంటే మ‌రికొన్ని రోజులు ఆగాల్సిందే.

Loading...

Leave a Reply

*