మనోడు ఇంకా సెట్స్ పైకి వెళ్లలేదట…

dj

చాలా రోజుల కిందటే హరీష్ శంకర్ దర్శకత్వంలో డీజే సినిమాకు కొబ్బరికాయ కొట్టేశాడు బన్నీ. ఆ తర్వాత చాలా రోజులకు సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా ప్రారంభమైంది. అయితే రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయినప్పుడు మాత్రం ఒక్కటంటే ఒక్క ఫొటో కూడా బయటకురాలేదు. అదేంటి.. బన్నీ ఫస్ట్ డే షూటింగ్ స్టిల్స్ బయటకు రాకపోవడం ఏంటని అంతా ఆశ్చర్యపోయారు. అప్పుడెప్పుడో ముహూర్తం అప్పుడు తీసిన ఫొటోల్నే షేర్ చేశారు. కానీ అసలు విషయం ఇప్పుడు బయటపడింది.డీజే సినిమా షూటింగ్ ప్రారంభమైందనే విషయం నిజమే కానీ… అందులోకి బన్నీ ఇంకా చేరలేదట. అవును.. ప్రత్యేకమైన మేకోవర్ పనిలో ఉన్న బన్నీ…

డీజే సినిమా సెట్స్ పైకి ఇంకా అడుగుపెట్టలేదట. ఈలోగా చిన్నాచితగా సీన్లు ఉంటే హరీష్ శంకర్ వాటిని చెక్కుతూ కూర్చున్నాడట. దిల్ రాజు బ్యానర్ లో ప్రతిష్టాత్మకంగా 25వ చిత్రంగా తెరకెక్కుతున్న డీజే సినిమాకు సంబంధించి బన్నీ లుక్ ఇంకా ఫైనలైజ్ కాలేదని తెలుస్తోంది. అందుకే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైనా.. బన్నీ పార్ట్ ఇంకా షురూ కాలేదట.తాజా సమాచారం ప్రకారం.. సెట్స్ పైకి రావడానికి బన్నీ ఇంకో వారం రోజులు గ్యాప్ తీసుకుంటాడట. ఇప్పటివరకు అల్లువారబ్బాయ్ ఏం చేశాడు.. ఈ గ్యాప్ లో ఏం చేయబోతున్నాడనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్.

Loading...

Leave a Reply

*