కేక పెట్టిస్తున్న అల్ల‌రిన‌రేష్ ఇంట్లో దెయ్యం నాకేం భ‌య్యం ట్ర‌యిల‌ర్….. !

allari-naresh

అల్ల‌రి నరేష్ లేటెస్ట్ మూవీ ఇంట్లో దెయ్యం నాకేం భ‌య్యం. ఈ సినిమా ట్ర‌యిల‌ర్ తాజాగా విడుదల‌యింది. అత్తారింటికి దారేది, నాన్న‌కు ప్రేమ‌తో, ఛ‌త్ర‌ప‌తి వంటి బ‌డా సినిమాల‌ను నిర్మించిన బీవీఎస్ఎన్ ప్ర‌సాద్ ఈ మూవీకి నిర్మాత‌. దేనికైనా రెఢీ వంటి కామెడీ చిత్రాల ద‌ర్శ‌కుడు జి.నాగేశ్వ‌ర‌రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ మూవీ ట్ర‌యిల‌ర్ ఆక‌ట్టుకునేలా ఉంది.

మ‌జ్ను ఫేమ్ అను ఇమ్మాన్యుయేల్ హీరో్యిన్‌గా న‌టిస్తున్న ఈ సినిమా హార‌ర్ కామెడీ చిత్రాల ట్రెండ్ బ్యాక్ డ్రాప్‌లో తెర‌కెక్కింది. రీసెంట్‌గా ఆ జాన‌ర్‌లో వ‌చ్చిన సినిమాల స‌క్సెస్ ప‌ర్సంటేజ్ ప‌డిపోయింది. కానీ ఇంట్లో దెయ్యం నాకేం భ‌య్యం కాస్త డిఫ‌రెంట్ ఫార్మాట్‌లో క‌నిపిస్తోంది. రాజేంద్ర‌ప్ర‌సాద్‌, చ‌ల‌ప‌తిరావు వంటి సీనియ‌ర్‌ల ఎంట్రీతో ఈ సినిమాకి బలం మ‌రింత పెరిగింది. అయితే, ఇందులో దెయ్యం అంద‌రినీ ఆవ‌హిస్తున్న‌ట్లు క‌నిపిస్తోంది. ఇక డైలాగులు కూడా ద‌ర్శ‌కుడు జి.నాగేశ్వ‌ర రెడ్డి శైలికి త‌గ్గ‌ట్లుగా ఉన్నాయి. ఈ మంత్ ఎండింగ్‌లో రానున్న ఈ సినిమా ఎలాంటి మేజిక్ చేస్తుందో చూడాలి.

Loading...

Leave a Reply

*