ప్రేమ‌మ్ ప్రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే..?

premam

దాదాపు ఏడాదిన్న‌ర గ్యాప్ తర్వాత అక్కినేని యువ హీరో నాగ‌చైత‌న్య నుంచి వ‌స్తున్న మూవీ ఇది. స‌మంత ల‌వ్ అఫైర్, ప్రేమ‌, పెళ్లి అంశాల‌తో కొన్నాళ్లుగా చైతుకి మీడియాకి మంచి ఫోక‌స్ ద‌క్కింది. ఇదే విడుద‌ల‌కు రెడీ అవుతున్న ప్రేమ‌మ్ సినిమాకి కావ‌ల్సినంత ప్ర‌చారాన్ని తెచ్చిపెట్టింది. రీల్ లైఫ్ రొమాన్స్‌నే ప్రేమ‌మ్ వంటి రొమాంటిక్ ఎంట‌ర్‌ట‌యిన‌ర్‌లో పండించ‌డానికి రెడీ అవుతున్నాడు నాగ‌చైత‌న్య‌. ఆయన రియ‌ల్ లైఫ్ స్టోరీ స‌క్సెస్ అయింది.. మ‌రి రీల్ లైఫ్ ప్రేమ‌మ్ ఎలా ఉండబోతుందో ప్రివ్యూ వేద్దాం..

ప్రేమ‌మ్ సినిమా అంతా రొమాన్స్‌.. ఫ‌న్ గురించే. ఒక వ్య‌క్తి మూడు ద‌శ‌ల‌లోని మూడు ప్రేమ‌క‌థ‌ల స‌మాహారం ఈ క‌థ‌. ఆక‌ర్ష‌ణ‌, రొమాన్స్‌, నిజ‌మైన ప్రేమ‌, తొలిప్రేమ‌, విర‌హం, ప్రేమ వంటి అనుభూతుల‌ను, భావోద్వేగాల‌ను ప్రేమ‌మ్‌లో ఆస‌క్తిక‌రంగా తెర‌కెక్కించార‌ట‌. కార్తికేయ ఫేమ్ చందూ మొండేటి ఈ సినిమాకి డైరెక్ట‌ర్‌. నాగ‌చైత‌న్య స‌ర‌స‌న ముగ్గురు హీరోయిన్‌లు జ‌త క‌ట్టారు. శృతిహాస‌న్‌, అనుపమ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌, మడొన్నా సెబాస్టియ‌న్‌.. జోడీగా న‌టించారు.

ప్రేమ‌మ్ ప్రారంభంలోనే అదిరిపోతుంద‌ట‌. నాగ‌చైత‌న్య టీనేజ్ ల‌వ్ స్టోరీతో సినిమా మొద‌ల‌వుతుంద‌ట‌. మూడు క‌థ‌ల‌లో మొద‌టిది స్కూల్ బ్యాక్ డ్రాప్ ప్రేమ‌మ్‌. ఆయ‌న తొలి ప్రేమ‌.. అదే ఆక‌ర్ష‌ణ‌.. అనుప‌మ ప‌ర‌మేశ్వ‌రన్‌తో. స్కూల్ డేస్‌లోనే ఓ అమ్మాయి ఆక‌ర్ష‌ణ‌లో ప‌డి ఎలా కెరీర్‌ను, ప్రేమ‌ను నెట్టుకొచ్చాడనే పాయింట్‌ను చందూ మొండేటి బాగా డీల్ చేశాడ‌ట‌. మెచ్యూరిటీ లేని ల‌వ్ స్టోరీలో చైతు బాగా న‌టించాడ‌ట‌. ఓ మారుమూల ప‌ల్లెటూరిలో స్కూల్‌కి వెళ్లే టైమ్‌లో అమ్మాయిలు, అబ్బాయిల మ‌ధ్య చిలిపి అల్ల‌రిని, చిన్న చిన్న రొమాంటిక్ సీన్‌ల‌ని, చైల్డిష్ అల్ల‌రిని ఎలివేట్ చెయ్య‌డంలో ద‌ర్శ‌కుడు స‌క్సెస్ అయ్యాడ‌నే టాక్ వినిపిస్తోంది.

స్కూల్ ల‌వ్ అక్క‌డే డ్రాప్ అవుతుంది. ఇక‌, రెండోది కాలేజ్ ల‌వ్ స్టోరీ. దీనిని అద్భుతంగా తెర‌కెక్కించాడ‌ట ద‌ర్శ‌కుడు చందూ మొండేటి. కాలేజ్ లైఫ్ అంటేనే మ‌జా. ఫ్రెండ్స్‌, లెక్చ‌ర‌ర్స్‌, అమ్మాయిలు, ర్యాగింగ్‌, గొడ‌వ‌లు, చిన్న చిన్న త‌గాదాలు, సినిమాలు షికార్లు…. ఇలా అక్క‌డి వాతావ‌ర‌ణ‌మే డిఫ‌రెంట్‌. ఇక్క‌డ కూడా ఓ ల‌వ్ స్టోరీ ర‌న్ చేస్తాడు నాగ‌చైత‌న్య‌. అదీ కాలేజ్ లెక్చ‌ర‌ర్‌తోన‌ట‌. ఆవిడే శృతిహాస‌న్‌. ఈ ల‌వ్ స్టోరీ కూడా బ్రేక‌ప్ అట‌. అయినా, మ‌ధురాతి మ‌ధురంగా తెర‌కెక్కించాడ‌ట ద‌ర్శ‌కుడు. చైతు-శృతికి మ‌ధ్య వ‌చ్చే ఓ సీన్‌.. సినిమాకి హైలైట్ అవుతుంద‌ని భావిస్తున్నార‌ట ద‌ర్శ‌క‌నిర్మాఆత‌లు. అయితే, ఈ ల‌వ్ ఎందుకు బ్రేకప్ అయింద‌నేది మ‌రో యాంగిల్‌.

శృతి ల‌వ్ బ్రేకప్ త‌ర‌వాత కాలేజ్ డేస్ అయిపోతాయి. ఇక‌, జాబ్ స్టేజ్‌లోనూ చైతు ఓ అమ్మాయి ల‌వ్‌లో ప‌డ‌తాడు. ఇది మెచ్యూర్డ్ ల‌వ్ అట‌. జీవితంలో సెటిల‌యిన త‌ర్వాత పూర్తిగా త‌న‌కంటూ బ‌రువు బాధ్య‌త‌లు తెలిసిన త‌ర్వాత తన ఏజ్ గ్రూప్‌కి త‌గ్గ అమ్మాయితో ప్రేమ‌. ఇది థ‌ర్డ్ ల‌వ్ స్టోరీ. ఈ ల‌వ్‌లో హీరోయిన్ మ‌డొన్నా సెబాస్టియ‌న్‌. దుర‌దృష్ట‌వ‌శాత్తు ఈ ప్రేమ కూడా బ్రేక్ అవుతుంది. అయితే, చివ‌రికి మ‌న హీరో ఎవ‌రిని మ్యారేజ్ చేసుకుంటాడు అనేది ఇంట‌రెస్టింగ్ క్ల‌యిమాక్స్‌గా చిత్రీక‌రించాడ‌ట ద‌ర్శ‌కుడు చందూ మొండేటి.

మ్యూజిక్‌కి మంచి రెస్పాన్స్ రావ‌డంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. ప్ర‌తి పాట విజువ‌ల్‌గా చాలా బావుంద‌ట‌. ఈ సినిమా యూత్‌కి బాగా క‌నెక్ట్ అవుతుంద‌ని, చైతు సెకండ్ మూవీ ఏమాయ చేశావేలా ఇది కూడా ఓ సూప‌ర్ డూప‌ర్ హిట్ అవుతుందని కాన్‌ఫిడెంట్‌గా ఉంది సినిమా యూనిట్‌. మ‌రి, ద‌ర్శ‌క‌నిర్మాత‌ల అంచ‌నాలు నిల‌బెడుతుందో లేదో మ‌రికొన్ని గంట‌ల్లో తేల‌నుంది.

Loading...

Leave a Reply

*