చెర్రీ రికార్డ్‌ని సింగిల్ హ్యాండ్‌తో కొడ‌తాడ‌ట చైతు..!

chaitu

రామ్‌చ‌ర‌ణ్‌కి రీసెంట్‌గా టాలీవుడ్‌లో స‌రైన హిట్ లేదు. ఆయ‌నకు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఇటీవ‌ల ఫ్లాప్‌లే ఎదుర‌వుతున్నాయి. రెండున్న‌రేళ్ల క్రితం వ‌చ్చిన ఎవడు త‌ర్వాత చ‌ర‌ణ్ పూర్తిగా డ‌ల్ అయ్యాడు. గోవిందుడు అంద‌రివాడేలే, బ్రూస్‌లీ ప‌రాజ‌యంతో చెర్రీ మ‌రింత డౌన్ అయ్యాడు. ఆయ‌న గ్రాఫ్ ప‌డిపోయింది ఇటీవ‌ల‌.

టాలీవుడ్‌తోపాటు చెర్రీకి మ‌రో వీక్ ఏరియా.. ఓవ‌ర్సీస్‌. ఫారిన్ మార్కెట్‌లో ఆయ‌న‌కు స‌రైన స‌క్సెస్‌లేదు. మిలియ‌న్ డాల‌ర్ క్లబ్‌లో ఆయ‌న‌కు చోటు లేదు. చ‌ర‌ణ్ న‌టించిన ఒక్క చిత్రం కూడా ప‌ది ల‌క్ష‌ల డాల‌ర్‌ల‌ను మించి వ‌సూళ్లు సాధించ‌లేక‌పోయింది. శ్రీను వైట్ల ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన బ్రూస్‌లీ కేవ‌లం 8.5 ల‌క్ష‌ల డాల‌ర్‌ను మాత్ర‌మే పొందింది. దీంతో, అక్క‌డ త‌న స్టామినాని ప్రూవ్ చేసుకోవాల‌ని చూస్తున్నాడు రామ్‌చ‌ర‌ణ్‌.

ఓవ‌ర్సీస్ విష‌యంలో చెర్రీ కంటే చైతు బెట‌ర్‌. డాల‌ర్ హీరోగా ప్రూవ్ చేసుకున్నాడు. చైతు న‌టించిన మ‌నం మూవీ అక్క‌డ 15ల‌క్ష‌ల డాల‌ర్‌లు సాధించింది. ఓవర్సీస్‌లో ఇవి మంచి వ‌సూళ్లు. ఇది అక్కినేని హీరోల మ‌ల్టీస్టార‌ర్‌. సోలో హీరోగా చైతుకి కూడా మిలియ‌న్ డాల‌ర్ క్ల‌బ్‌లో చోటు లేదు. అయితే, ఆయ‌న రీసెంట్ చిత్రం ప్రేమ‌మ్ ఇప్ప‌టిదాకా ఓవ‌ర్సీస్‌లో 6.7 ల‌క్ష‌ల డాల‌ర్‌లు పొందింది. మ‌రో రెండు మూడు వారాల దాకా మంచి సినిమా లేదు. ఈ సినిమాకి అక్క‌డ పాజిటివ్ టాక్ వ‌చ్చింది. దీంతో, ప్రేమ‌మ్ గ్యారంటీగా బ్రూస్‌లీ రికార్డ్‌ల‌ను బ‌ద్ద‌లు కొడుతుంద‌ని కాన్‌ఫిడెంట్‌గా ఉన్నాడు. మిలియ‌న్ డాల‌ర్‌లు వ‌చ్చినా రాక‌పోయినా.. చెర్రీ వ‌సూళ్ల‌ను బీట్ చేస్తాన‌ని ధీమాగా ఉన్నాడ‌ట అక్కినేని యువ హీరో. మ‌రి, లాంగ్‌ర‌న్‌లో సింగిల్ హ్యాండ్‌తో చైతు ప్రేమ‌మ్ ఆ రికార్డ్‌ను పొందుతుందా? లేదా? అనేది చూడాలి.

Loading...

Leave a Reply

*