నితిన్‌కు అఖిల్ చూసిన అమ్మాయి బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే..?

akhil-and-nitin

త‌న తొలి సినిమాని నితిన్ నిర్మించాడ‌నో లేక‌, త‌న‌కు మొద‌టి నుంచి ఉన్న అనుబంధ‌మో తెలియ‌దు కానీ, నితిన్‌కి మ్యాచ్ చూసే పనిలో ప‌డ్డాడు అఖిల్‌. టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్స్‌లలో ఒక‌డైన నితిన్ కోసం ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు. దీంతో, అఖిల్ ఆయ‌న‌కు ఓ మ్యాచ్ ప్ర‌పోజ్ చేశాడ‌ట‌. ఆ అమ్మాయి ఓకే అంటే ఇంట్లో పెద్ద‌ల‌తో మాట్లాడ‌తాన‌ని హామీ ఇచ్చాడ‌ట‌. ఆమె ఎవ‌రో కాదు త‌న కాబోయే భార్య‌, ప్రియురాలు శ్రీయా భూపాల్ స్నేహితురాలేన‌ని స‌మాచారం. మొద‌టినుంచి వారిద్ద‌రి మ‌ధ్య ఉన్న అనుబంధంతోనే ఈ చొర‌వ తీసుకుంటున్నార‌ట‌. ఆ అమ్మాయికి కూడా నితిన్ అంటే ఇష్ట‌మ‌ని.. ఇప్ప‌టికే ఒక‌టీ రెండు సార్లు ఫంక్ష‌న్‌లలో చూసుకున్నార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఆమె ఎవ‌రోకాదు.. హైద‌రాబాద్‌లోని ఓ బ‌డా పారిశ్రామిక వేత్త కూతురు అట‌. ఆయ‌న‌కు చిన్న చిన్న ప‌రిశ్ర‌మ‌లు ఉన్నా.. ఎక్కువ‌గా ఆయ‌న ఫోక‌స్ రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారమేన‌ని స‌మాచారం. వారికి, శ్రీయా భూపాల్ అంటే జీవీకే ఫ్యామిలీకి ద‌గ్గ‌రి సంబంధాలున్నాయంటున్నారు. అందుకే, శ్రియా భూపాల్ కూడా ఇంటరెస్ట్ చూపించింద‌ని చెబుతున్నారు. ఈ మ్యాచ్‌పై నితిన్ దాదాపుగా ఓకే అన్నాడ‌ని, కానీ, ఇంటి పెద్ద‌లకి ఆ బాధ్య‌త‌ను అప్ప‌జెప్పాల‌ని చూస్తున్నాడ‌ట‌. మ‌రి, అఖిల్ పెళ్లి పెద్ద‌గా ఉన్న ఈ సంబంధం ఓకే అవుతుందా..? లేదా..? అనేది తేలాలి.

Loading...

Leave a Reply

*