ట్విట్ట‌ర్‌లో అఖిల్ బూతు పురాణం..!

akhil

అక్కినేని యువ హీరో, నాగ్ వార‌సుడు.. అఖిల్ చేసిన ఓ ట్వీట్‌.. హాట్ టాపిక్‌గా మారింది. టాలీవుడ్‌లో కొత్త చ‌ర్చకు దారి తీస్తోంది. సోష‌ల్ మీడియాలో అఖిల్ బాగా ప్రో యాక్టివ్‌గా ఉంటాడు. త‌న సినిమాల‌తోపాటు తండ్రి నాగ్‌, బ్ర‌ద‌ర్ చైతు సినిమాల డీట‌యిల్స్ అప్‌డేట్ చేస్తాడు. ఇటు, అక్కినేని యువ హీరోల సినిమాల‌పైనా ఆయ‌న కామెంట్స్ చేస్తుంటాడు. అంతేకాదు, తన‌కు న‌చ్చిన సినిమాలు, ఈవెంట్స్‌పైనా బాగా స్పందిస్తాడు అఖిల్. ఇలా యాక్టివ్‌గా ఉండే అఖిల్‌.. రీసెంట్‌గా సుమంత్ అప్‌క‌మింగ్ మూవీ న‌రుడా.. డోన‌రుడా సినిమా పోస్ట‌ర్‌ని చూసి ఓ బూతు కామెంట్ చేశాడని చెప్పుకుంటున్నారు. హిందీలో హిట్ అయిన విక్కీ డోనార్ మూవీకి ఇది రీమేక్‌.

వీర్య‌క‌ణాల దానం బ్యాక్ డ్రాప్‌లో సినిమా తెర‌కెక్కుతోంది. ఈ సినిమా ప‌స్ట్ లుక్‌లో సుమంత్ సూప‌ర్ మ్యాన్‌లా ఉన్నాడ‌నే కామెంట్స్ వినిపించాయి. అయితే, అఖిల్‌.. సూప‌ర్ మ్యానా.. లేక‌.. ఎస్‌.. మ్యాన్‌.? అంటూ ట్వీట్ చేశాడు. ఎస్.. మ్యాన్ త‌ర్వాత అఖిల్ పాజ్ ఇచ్చి చుక్క‌లు పెట్ట‌డం హాట్ టాపిక్‌గా మారింది. ఇందులో ఏదో బూతు ఉంద‌ని, అందుకే, ఆయ‌న డాట్స్ పెట్టాడంటున్నారు కొంద‌రు. మ‌రి, అఖిల్ ఎందుకు డాట్స్ పెట్టాడో, అస‌లు ఆ బూతు ఏంటో.. అనేది ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

Akhil Akkineni ‏@AkhilAkkineni8  Sep 19
Loving this ! Superman or S****Man!Kickass first look with a kick ass title. Way to go bro can’t wait to c the kids

Loading...

Leave a Reply

*