నితిన్‌కి పెళ్లి సెట్ చేసిన అఖిల్‌… త‌న కాబోయే భార్య స్నేహితురాలే అమ్మాయి..!

untitled-33

టాలీవుడ్ మోస్ట్ బ్యాచిలర్ హీరోలలో ఒకరిగా ఉన్న నితిన్ కి పెళ్ళి గడియలు దగ్గర పడ్డాయనే టాక్ వినిపిస్తోంది. నితిన్ తో అఖిల్ కి ఉన్న సాన్నిహిత్యం కారణంగా అఖిల్ తనకు కాబోయే వైఫ్ స్నేహితురాలిని నితిన్ కి ఇచ్చి వివాహం చేయాలనే ప్లాన్ లో ఉన్నాడట. ఈ విషయానికి సంబంధించి అనేక చర్చలు జరుగుతున్నట్టు టాక్. అయితే నితిన్ ఈ వివాహంపై పాజిటివ్ గానే స్పందించినట్టు తెలుస్తోంది.

అ..ఆ మూవీ తర్వాత నితిన్ హ‌ను రాఘ‌వ‌పూడి సినిమాకి కమిట్ అయ్యాడు. ఇటు, మ్యారేజ్ విష‌యంలోనూ ఆయ‌న తొంద‌ర ప‌డుతున్నాడు. అందుకే, నితిన్‌కి అఖిల్ ఓ మ్యాచ్ చూశాడ‌ని, ఆ అమ్మాయి ప్రొఫైల్‌.. నితిన్ ఫ్యామిలీలోనూ బాగా న‌చ్చింద‌నే టాక్ వినిపిస్తోంది. ఆమె ఎవ‌రోకాదు.. నితిన్ కాబోయే భార్య‌, త‌న ప్రియురాలు శ్రీయా భూపాల్ ఫ్రెండ్ అని స‌మాచారం. అటు ఆ అమ్మాయి త‌ర‌ఫు వారికి, ఇటు నితిన్ ఫ్యామిలీకి ఈ మ్యాచ్‌పై ఓ అవ‌గాహ‌న‌కు వ‌చ్చార‌ని, అఖిల్‌-శ్రీయా భూపాల్ కూడా ద‌గ్గ‌రుండి ఇరు కుటుంబాల‌తోనూ మాట్లాడార‌ని స‌మాచారం. టోటల్‌గా నితిన్ అయితే, ఈ మ్యారేజ్‌కి సిద్ధంగా ఉన్నాడ‌ని చెబుతున్నారు.

అఖిల్ తొలి సినిమా అఖిల్‌ని నిర్మించింది నితిన్ కుటుంబ‌మే. అప్ప‌టినుంచే రెండు కుటుంబాల మ‌ధ్య మ‌రింత సాన్నిహిత్యం ఏర్ప‌డింది. ఇదే ఇప్పుడు ఆ బంధాన్ని మరింత ముందుకు తీసుకుపోయేలా చేస్తోంది. మ‌రి, అఖిల్ చూసిన మ్యాచ్‌ని నితిన్ కుటుంబం ఓకే అంటుందో లేదో చూడాలి.

 

Loading...

Leave a Reply

*