అఖిల్ తప్పు చేస్తున్నాడా…

akhil

అక్కినేని హీరోలంతా క్లాస్. జనాలు కూడా దానికే ఫిక్స్ అయ్యారు. నాగార్జున నుంచి అతడి నటవారసుడిగా కొనసాగుతున్న నాగచైతన్య వరకు అంతా ఇలానే చేస్తున్నారు. క్లాస్ ఇమేజ్ తోనే కెరీర్ కొనసాగిస్తున్నారు. మరి అఖిల్ ఏంటి రూటు మారుస్తున్నాడు.. నా రూటే సెపరేట్ అంటున్నాడు. కొంపదీసి సిసింద్రీ దెబ్బయిపోతాడా…

రెండో సినిమా స్టార్ట్ కాకుండానే మాస్ ఇమేజ్ కోసం అఖిల్ తన మూడో సినిమాను ఊరమాస్ డైరెక్టర్ తో ప్లాన్ చేస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఇన్నర్ సర్కిల్ లో చక్కర్లు కొడుతున్న వార్తల ప్రకారం.. స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో అఖిల్ మూడో సినిమా ఉంటుందని తెలుస్తోంది. ఈ మేరకు చర్చలు కూడా జరుగుతున్నాయనే ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో సినిమా చేస్తోన్న బోయపాటి.. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవిని డైరెక్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ ఆ ప్రాజెక్టు సెట్ కాకపోయినా లేక ఆ తర్వాతైనా అఖిల్ తో సినిమా చేయాలని బోయపాటి భావిస్తున్నట్లు వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.

మరి ఇందులో ఎంత నిజముందో తెలియదు గాని.. అఖిల్-బోయపాటి కాంబినేషన్ ఏమాత్రం గాడి తప్పినా అఖిల్ కు మరోసారి పెద్ద ఎదురుదెబ్బ ఖాయమని విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా మాస్ ఇమేజ్ కోసం గట్టిగా ట్రై చేస్తే అఖిల్ తప్పు చేసినట్లే అవుతుందని అంటున్నారు. మరి అఖిల్ రిస్క్ తీసుకుని సక్సెస్ అవుతాడా? లేక ఇవన్నీ రూమర్లగానే మిగిలిపోతాయా? వెయిట్ అండ్ సీ…

Loading...

Leave a Reply

*