బ‌చ్చ‌న్‌ల వార్నింగ్‌కి భ‌య‌ప‌డ్డ ఐష్‌.. ఏం చేసిందంటే…..!

aish

ఐష్‌కి బ‌చ్చ‌న్ ఫ్యామిలీ సీరియ‌స్ వార్నింగ్ ఇచ్చింద‌నే పుకార్లు షికార్ చేశాయి. ఈ వీకెండ్ కానుక‌గా విడుద‌ల‌యిన యే దిల్ హై ముష్కిల్ సినిమాలో ఆమె న‌టించిన ఎరోటిక్ సీన్స్ దేశ‌వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశంగా మారాయి. పెళ్లి అయిన త‌ర్వాత ఐశ్వ‌ర్య‌రాయ్ ఇలాంటి పాత్ర‌ల‌లో ఇంత‌గా రెచ్చిపోవాల్సిన అవసరం ఏంట‌నేది హాట్ టాపిక్ అయింది. యువ హీరో ర‌ణ్‌బీర్ కూప‌ర్‌తో ఐశ్వ‌ర్య రాయ్ న‌టించిన ఇంటిమేట్ సీన్‌లతో బ‌చ్చ‌న్ ఫ్యామిలీలో లుక‌లుక‌లు మ‌రోసారి బ‌య‌ట‌ప‌డ్డాయ‌నే వార్త సంచ‌ల‌నంగా మారింది.అంతకుముందు అత్త జ‌యాబ‌చ్చ‌న్‌తో ఐశ్వ‌ర్య‌రాయ్‌కి విబేధాలున్నాయ‌నే గుస‌గుస‌లు వినిపించాయి.

ఈ తాజా ఎపిసోడ్‌తో అవి కాస్త మ‌రింత ముదురుపాకాన ప‌డ్డాయ‌ట‌. మీడియాలో వ‌చ్చిన స్టిల్స్‌,పోస్ట‌ర్స్ చూసి వెంట‌నే అలెర్ట‌యిన అమితాబ్ బ‌చ్చ‌న్‌.. సినిమాలో ఐశ్వ‌ర్య‌రాయ్ న‌టించిన చాలా స‌న్నివేశాల‌ను డిలీట్ చేయించారనే టాక్ వినిపించింది. ఇటు, సెన్సార్ బోర్డ్‌లోనూ త‌న ఇన్‌ఫ్లూయెన్స్ ఉప‌యోగించి క‌త్తెర వేయించార‌నే ప్ర‌చారం కూడా జ‌రిగింది. ఇలా ఉంటే, ఆ త‌ర్వాత వెంట‌నే ఒక్క‌ట‌యిన బ‌చ్చ‌న్ ఫ్యామిలీ ఐశ్వ‌ర్య‌రాయ్‌కి సీరియ‌స్ వార్నింగ్ ఇచ్చింద‌ట‌. ఇలా అయితే క‌ష్ట‌మ‌ని, ప‌ద్ద‌తి మార్చుకోవాల‌ని సీరియ‌స్‌గా చెప్పింద‌నే వార్త‌లు బ‌య‌ట‌కు వ‌చ్చాయి.

ముందు యే దిల్ హై ముష్కిల్ సినిమా ప్ర‌మోష‌న్‌కి దూరంగా ఉండాలిన సూచించిందంట‌. లేదంటే, తీవ్ర ప‌రిణామాలు ఉంటాయ‌ని హెచ్చ‌రిక‌లు కూడా పాస్ చేసింద‌ట కోడ‌లికి బ‌చ్చ‌న్ ఫ్యామిలీ. ప‌రిస్థితులు ఇంత సీరియ‌స్ అవుతాయ‌ని భావించ‌ని ఐష్‌.. వెంట‌నే ఆ సినిమా ద‌ర్శ‌క‌నిర్మాత‌ల‌కు ముందే తాను ప్ర‌మోష‌న్స్‌కు దూర‌మ‌ని చెప్పేసింద‌ట‌. అందుకే, బిగ్ బాస్ సెట్స్‌పై స‌ల్మాన్ ఖాన్‌తో సినిమా టీమ్ ఇంట‌రాక్ష‌న్ ఉన్నా.. ఐష్ దానికి డుమ్మా కొట్టిందని స‌మాచారం. ఇలా, బ‌చ్చ‌న్ ఫ్యామిలీ అంతా ఒక్క‌ట‌వ‌డంతో ఐశ్వ‌ర్య‌రాయ్ వెంట‌నే వారిని కూల్ చేసే ప‌నిలో ప‌డింద‌ని తెలుస్తోంది. మ‌రి, ఇప్ప‌టిక‌యినా, అమితాబ్‌, జ‌యా బ‌చ్చ‌న్‌లతో విబేధాలు స‌మసిపోతాయా? లేదా? అనేది చూడాలి.

Loading...

Leave a Reply

*