మహేష్ మూవీలో మరోసారి సిక్స్ ప్యాక్…  

mahi

మహేష్ ఎప్పుడు ఏ సినిమా చేసినా అందులో సిక్స్ ప్యాక్ ప్రస్తావన కచ్చితంగా వస్తుంది. హీరోలంతా విపరీతంగా కండలు పెంచి, వెండితెరపై తమ బాడీని కూల్ గా ప్రజెంట్ చేస్తున్న ఈ టైమ్ లో… మహేష్ కూడా ఆ లీగ్ లోకి చేరితే బాగుంటుందని చాలామంది భావిస్తున్నారు. కానీ మహేష్ సిక్స్ ప్యాక్ చేయడం మాట అటుంచి, కనీసం షర్ట్ విప్పడమే గగనం అయిపోయింది. శ్రీమంతుడు లో లుంగీ కట్టి, దాన్ని పైకి ఎగకడితేనే చాలామంది ఫిదా అయిపోయారు. అలాంటి మహేష్ బాబు సినిమాలో సిక్స్ ప్యాక్ రూమర్లు మరోసారి స్టార్టయ్యాయి. గతంలో మహేష్ ఎప్పుడూ సిక్స్ ప్యాక్ చేయకపోయినా… వన్-నేనొక్కడినే సినిమా టైమ్ లో మాత్రం సిక్స్ ప్యాక్ రేంజ్ లో బిల్డప్ ఇచ్చాడు.

ఒకేఒక్క సీన్ లో తన కండలు చూపించాడు.నిజానికి అది సిక్స్ ప్యాక్ కాదని కూడా ఒప్పుకున్నాడు ప్రిన్స్. కేవలం కథకు తగ్గట్టు ఫిట్ గా ఉండేందుకే అలా కనిపించానని చెప్పుకొచ్చాడు. మరి ఇప్పుడు మురుగదాస్ సినిమా కోసం మహేష్ మరోసారి సిక్స్ ప్యాక్ ట్రై చేస్తున్నాడా…మహేష్-మురుగదాస్ సినిమాలో సిక్స్ ప్యాక్ ఎప్పీయరెన్స్ ఉంది. కాకపోతే అది చేస్తోంది మహేష్ బాబు కాదు. ఆ సినిమాలో విలన్ గా నటిస్తున్న ఎస్ జే సూర్య. అవును.. మహేష్ కు ఆపోజిట్ గా విలన్ గా నటిస్తున్న ఎస్ జే సూర్య ఇందులో సిక్స్ ప్యాక్ లో కనిపించబోతున్నాడట. హీరో-విలన్ మధ్య వచ్చే సన్నివేశాలు చాలా బలంగా ఉంటాయట. అదీ సంగతి.

 

Loading...

Leave a Reply

*