క‌న్న‌డ సినిమా షూటింగ్‌లో విషాదం.. హెలికాప్ట‌ర్ నుంచి ప‌డి హీరో, స్టంట్‌మేన్ మృతి..!

kanada

క‌న్న‌డ చిత్ర ప‌రిశ్ర‌మ ఊహించ‌ని షాక్ త‌గిలింది. ఓ కన్నడ సినిమా షూటింగ్‌లో భాగంగా బెంగళూరు శివార్లలోని టిజి హల్లి చెరువులో నిర్వహించిన ఫిల్మ్ స్టంట్‌లో అపశృతి చోటు చేసుకుంది. హెలికాఫ్టర్ నుంచి దూకిన ముగ్గురిలో ఇద్దరు చనిపోయారు. హీరో విజయ్ అతి కష్టమ్మీద ఈతకొట్టుకుంటూ వచ్చారు.

హీరోగా రెయిజ్ అవుతున్న ఉద‌య్ చ‌నిపోగా, స్టంట్ మాస్ట‌ర్‌గా పనిచేస్తున్న అనిల్ కూడా మ‌ర‌ణించాడు. హెలికాఫ్టర్ నుంచి నీళ్లలోకి దూకే షాట్ తీస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. తగిన జాగ్రత్తలు తీసుకోనందుకు సినిమా డైరక్టర్‌పై కేసు నమోదు చేశారు పోలీసులు.

Loading...

Leave a Reply

*