ఎన్టీఆర్ ని చూసి భయపడిన బాలీవుడ్ హీరో…

untitled-2

అవును నిజమే… ఎన్టీఆర్ విశ్వరూపం చూసి ఓ బాలీవుడ్ హీరో నిజంగానే బెంబేలెత్తిపోయాడు. ఇదేం విశ్వరూపంరా బాబూ అంటూ కళ్లు పెద్దవి చేసి చూశాడు. టెంపర్ సినిమాతో ఆ విశ్వరూపాన్ని చూసిన బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్. ఈ విషయాన్ని స్వయంగా దర్శకుడు పూరీ జగన్నాధ్… ఆఫ్-స్క్రీన్ లో షేర్ చేసుకున్నాడు.

ఇప్పటికే బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన పూరి… కుదిరితే అభిషేక్ బచ్చన్ తో ఓ సినిమా చేయాలనుకున్నాడు. అది కూడా టెంపర్ సినిమాకు రీమేక్ చేయాలనుకున్నాడు. అందుకే టెంపర్ సినిమా డీవీడీని అభిషేక్ కు ఇచ్చాడట. సినిమా నచ్చితే కచ్చితంగా రీమేక్ చేద్దామని అన్నాడట. టెంపర్ సినిమాను ఆసాంతం చూసిన అభిషేక్.. సినిమా చాలా బాగుందని, కానీ రీమేక్ చేయడం మాత్రం కుదరదని తేల్చేశాడట.

టెంపర్ రీమేక్ చేయకపోవడానికి అభిషేక్ చెప్పిన రీజన్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. సినిమాలో ఎన్టీఆర్ యాక్టింగ్ చూసి అభిషేక్ మైండ్ బ్లాక్ అయిందట. తను ఆ రేంజ్ లోనటించలేనని ఓపెన్ గానే చెప్పేశాడట. మరీ ముఖ్యంగా కోర్టు సీన్ లో ఎన్టీఆర్ నట విశ్వరూపానికి అభిషేక్ ఫిదా అయిపోయాడట. ఆ రేేంజ్ పర్ ఫార్మెన్స్ తనవల్ల కాదని పూరికి చెప్పేశాడట. అందుకే టెంపర్ బాలీవుడ్ రీమేక్ ఆగిపోయిందంటున్నాడు పూరి.

Loading...

Leave a Reply

*