ఆ నిర్మాత టార్గెట్‌.. సునీల్ కెరీర్‌ని నాశ‌నం చెయ్య‌డం..!

unnamed

సునీల్‌ని రీసెంట్‌గా ఓ నిర్మాత వెంటాడుతున్నాడట‌.. ఆయ‌న కెరీర్‌ని స‌మాధి చేసే ప్లాన్ వేస్తున్నాడ‌ట‌. గ‌త కొంత‌కాలంగా ఆ నిర్మాత చాప‌కింద నీరులా ఈ ప‌నిచేస్తున్నా.. ఇటీవ‌లే అందాల రాముడి ద‌గ్గ‌ర‌కు మేట‌ర్ వ‌చ్చిందట‌. పాత సంఘ‌ట‌న‌ల‌ను అన్నింటినీ ప‌రిశీలించిన సునీల్‌కి అది వాస్త‌వ‌మే అని తేలింద‌ట‌. చిత్ర ప‌రిశ్ర‌మ‌లోని ఓ బ‌డా వ్య‌క్తి కూడా కొన్నాళ్ల క్రితం సునీల్‌ని ఇదే విష‌య‌మై హెచ్చ‌రించాడ‌ట‌. నీ వెనుక ఏదో కుట్ర జ‌రుగుతోంద‌ని. అది ఇప్పుడు నిజ‌మేనని భావిస్తున్నాడు మ‌ర్యాద‌రామ‌న్న‌.

రీసెంట్‌గా సునీల్ సినిమాల శాటిలైట్ రైట్స్‌ని ఏ చానెల్ యాజ‌మాన్యం కొన‌డం లేదట‌. పూల‌రంగ‌డు త‌ర్వాత సోలో హీరోగా స‌రైన చాన్స్‌లేని సునీల్‌కి… ఈ ఏడాది జ‌క్క‌న్న రూపంలో మంచి హిట్ ల‌భించింది. కానీ, ఈ సినిమా శాటిలైట్ హ‌క్కుల‌ను ఏ చానెల్ కొన‌డం లేద‌ట‌. జ‌క్క‌న్న నిర్మాత ఇటీవ‌ల ఓ చానెల్‌తో మాట్లాడి ఆ డీల్‌ని అడ్డుకున్నాడ‌ట‌. దీంతో, రేపు ఆ చానెల్‌కి అమ్మిన‌ట్లు సైన్ చెయ్యాల్సిన జ‌క్క‌న్న నిర్మాత‌కు తెల్లార‌క‌ముందే షాక్ త‌గిలింద‌ట‌. ఓవ‌ర్‌నైట్ ఆనిర్మాత ఆ చానెల్‌ని మేనేజ్ చేసి సునీల్ సినిమా శాటిలైట్ రైట్స్‌ని కొన‌కుండా అడ్డుప‌డ్డాడ‌ట‌. ఇదంతా సునీల్ హ‌వాని, ఆయ‌న ఎదుగుద‌లను అడ్డుకోవ‌డానికే అని స‌మాచారం.

జ‌క్క‌న్నచిత్రాన్ని సంగ‌తి ప‌క్క‌న‌పెడితే.. ఇటీవ‌ల ఆయ‌న న‌టించిన ఈడు గోల్డ్ ఎహే సినిమా శాటిలైట్‌రైట్స్‌కి కూడా ఈ సెగ త‌గిలింద‌ట‌. ఇక‌, ఆయ‌న న‌టించిన కృష్ణాష్ట‌మి చిత్రం బుల్లితెర హ‌క్కులు కూడా ఇంత‌వ‌ర‌కు పోలేద‌ట‌. ఇప్ప‌టికీ ఆ సినిమా నిర్మాత ద‌గ్గ‌రే ఉన్నాయ‌ట‌. అంతేకాదు, కేవ‌లం శాటిలైట్ రైట్స్‌కే అనుకుంటే పొర‌పాటే. ఈడు గోల్డ్ ఎహే సినిమాని కొన్ని చానెల్స్‌లో ప్ర‌మోట్ చేయొద్ద‌ని స‌ద‌రు నిర్మాత స్వ‌యంగా చానెల్స్ యాజ‌మాన్యానికి ఫోన్ చేసి మ‌రీ చెప్పాడ‌ట‌. ఇదే ఈడు గోల్డ్ ఎహే సినిమాని చానెల్స్‌లో టెలికాస్ట్ చెయ్య‌లేద‌ట‌. ఇది సినిమాకి బాగా దెబ్బ‌తీసింద‌ని చెబుతున్నారు. దీంతో, సునీల్‌తో పెట్టుకుంటే మీ ప‌ని ఔట్ అని ఆయ‌న నిర్మాత‌ల‌కు వార్నింగ్ పంపుతున్నాడ‌ట ఆ నిర్మాత‌. ఇక‌పై ఆయ‌న‌తో సినిమాలు చెయ్యాలంటే క‌ష్ట‌మే అంటున్నారు కొంద‌రు. మ‌రి, సునీల్ ఆ నిర్మాత‌ను ఎలా ఫేస్ చేస్తాడో చూడాలి.

Loading...

Leave a Reply

*