రాజ‌మౌళికి బిగ్ షాక్.. బాహుబ‌లి టీమ్ నుంచి ముగ్గురు ఔట్‌..!

rajamouli

అవును, జ‌క్క‌న్న‌కి ఊహించని షాక్ త‌గులుతోంద‌ట‌. బాహుబ‌లి టీమ్ నుంచి ముగ్గురు సీనియ‌ర్‌లు, కీల‌క స‌భ్యులు ఇక దాదాపు ఆయ‌న‌కు గుడ్ బై చెప్ప‌డానికి రెడీ అవుతున్నార‌ట‌. ఇదే జ‌రిగితే రాజ‌మౌళికి న‌ష్టం జ‌ర‌గ‌డం ఖాయ‌మంటున్నారు.

రాజ‌మౌళి.. తెలుగు సినిమా స్థాయినే కాదు, బాహుబ‌లి, ఈగ‌తో భార‌తీయ సినిమా స్థాయిని మార్కెట్‌ని, ప్ర‌మాణాల‌ను పెంచిన ద‌ర్శ‌కుడు. ఓట‌మి ఎరుగ‌ని దర్శ‌క ధీరుడు. ప‌ది సినిమాలు డైరెక్ట్ చేస్తే ఒక్క ఫ్లాప్ లేదు. అన్నీ విజ‌యాలే. ప్రీ ప్రొడ‌క్ష‌న్ నుంచి పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ దాకా అన్నింటినీ ఆయ‌నే స్వ‌యంగా ప‌ర్య‌వేక్షిస్తాడు. ఇటు, చిత్ర ప‌రిశ్ర‌మ‌లోని అన్ని విభాగాల‌పైనా ఆయ‌న‌కు ప‌ట్టుంది. జ‌క్క‌న్న విజ‌యంలో ఆయ‌న‌తోపాటు ఆయ‌న టీమ్‌ది కూడా ఉంది. రాజ‌మౌళినే ఈ విష‌యం స్వ‌యంగా అంగీక‌రిస్తాడు. ఇలాంటి టీమ్ ఇండియాలోనే మ‌రో ద‌ర్శ‌కుడికి దొర‌క‌ద‌ని.. ప‌లు మార్లు చెప్పాడు జ‌క్క‌న్న‌. ఇంత మంచి టీమ్ నుంచి ముగ్గురు బ‌య‌ట‌కు వెళ్ల‌డానికి రెడీగా ఉన్నారంటే ఆయ‌న  ఏ ప‌రిస్థితులలో ఉన్నారో అర్ధం చేసుకోవ‌చ్చు. అయితే, అది గొడ‌వ‌లు, అభిప్రాయ బేధాలు వ‌చ్చి కాదు సుమా.. కేవ‌లం త‌మ సొంత నిర్ణ‌యాలు, కెరీర్‌కి సంబంధించి మాత్ర‌మే.

ఇంత‌కీ ఆ ముగ్గురు ఎవ‌ర‌నుకుంటున్నారా..? ఆయ‌న పెద్ద‌న్న‌య్య‌.. కీర‌వాణి.. అవును, ఇప్ప‌టికే కీర‌వాణి రిటైర్‌మెంట్  ప్ర‌క‌టించాడు. 2016 త‌ర్వాత ఆయ‌న ఇక వ‌ర్క్ చెయ్య‌న‌ని, విశ్రాంతి తీసుకుంటాన‌ని చెప్పాడు. సో.. బాహుబ‌లి 2 త‌ర్వాత కీర‌వాణి సేవ‌లు జ‌క్క‌న్న‌కు అందుబాటులో ఉండ‌వ‌న్న‌మాట‌. తొలి చిత్రం స్టూడెంట్ నెంబ‌ర్ వ‌న్ నుంచి ఇప్ప‌టిదాకా రాజ‌మౌళి ప్ర‌తి సినిమాకి ఆయ‌నే సంగీత ద‌ర్శ‌కుడు.

ఇక‌, రెండో వ్య‌క్తి పీట‌ర్ హెయిన్స్‌. ఫైట్ మాస్ట‌ర్‌. ఛ‌త్ర‌ప‌తి నుంచి నేటి బాహుబ‌లి 2దాకా జ‌క్క‌న్న యాక్ష‌న్ పార్ట్ మొత్తాన్ని ఆయ‌నే లీడ్ చేస్తున్నాడు. ప్ర‌స్తుతం పీట‌ర్ హెయిన్స్ ద‌ర్శ‌క‌త్వంలో బిజీగా ఉన్నాడు. ఇక‌పై మ‌రిన్ని సినిమాల‌కు డైరెక్ష‌న్ చెయ్యాల‌ని భావిస్తున్నాడ‌ట‌. దీంతో, బాహుబ‌లి 2 త‌ర్వాత పీట‌ర్ హెయిన్స్ కూడా ఆయ‌న‌కు దొర‌క‌డ‌ట‌.

మూడో వ్య‌క్తి.. సెంథిల్ కుమార్‌. రాజ‌మౌళి సినిమాకి ఆయ‌నే క‌న్ను. అంటే సినిమాటోగ్రాఫ‌ర్‌. సెంథిల్ కుమార్ కూడా ఇకపై ద‌ర్శ‌క‌త్వంలో బిజీ అవ్వాల‌ని భావిస్తున్నాడ‌ట.దీంతో, బాహుబ‌లి 2 త‌ర్వాత జ‌క్క‌న్న టీమ్ మెంబ‌ర్‌గా కొన‌సాగే చాన్స్‌లు లేవ‌ట‌. సై నుంచి వీరి అనుబంధం కొన‌సాగుతోంది. అప్ప‌టినుంచి ఇప్ప‌టిదాకా రాజ‌మౌళికి ఈయ‌నే ఆస్థాన కెమెరామెన్. ఇలా ఈ ముగ్గురూ ఎవ‌రి సొంత వ్య‌వ‌హారాల‌లో బిజీ అవుతుండ‌డంతో వారికి ఏమీ చెప్ప‌లేక‌.. బాహుబలి 2 ఫినిష్ అయిన త‌ర్వాత ఆలోచిద్దాం అని చెప్పాడ‌ట రాజ‌మౌళి. మరి, ఏమ‌వుతుందో చూడాలి.

 

Loading...

Leave a Reply

*