10 రోజులకు రూ. 3 కోట్లు

mahesh

బ్రహ్మోత్సవం సినిమా డిజాస్టర్ అయింది. దీంతో ఆ ప్రభావం మహేష్ నటిస్తున్న కొత్త సినిమాపై పడిందని అంతా అనుకున్నారు. బ్రహ్మోత్సవం దెబ్బకు మురుగదాస్ దర్శకత్వంలో మహేష్ చేస్తున్న సినిమా బడ్జెట్ ను సగానికి సగం తగ్గించేశారంటూ ఆ మధ్య వార్తలు వచ్చాయి. అయితే తాజాగా అవన్నీ అబద్ధాలని తేలిపోయాయి. సినిమా కథ, సీన్ డిమాండ్ మేరకు ఎంత ఖర్చయినా పెట్టడానికి సిద్ధమని మాటలు చెప్పే ప్రొడ్యూసర్లు… దాన్ని చేసి చూపిస్తున్నారు. మహేష్ సినిమా కోసం కేవలం 10రోజుల షూటింగ్ కు 3 కోట్ల రూపాయలు ఖర్చుపెడుతున్నారు.

ప్రస్తుతం మహేష్ సినిమా షూటింగ్… హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. మహేష్ పై కొన్ని ఛేజింగ్ సీన్లు తీస్తున్నారు. ఓ వైపు బోటులో, మరోవైపు కారులో ఛేజ్ చేస్తూ సాగే ఈ భారీ యాక్షన్ సీక్వెన్స్‌కు ఏకంగా 3 కోట్లు ఖర్చు అవుతోందట. వారం పాటు చిత్రీకరించనున్నఈ ఫైట్ సీన్స్ సినిమాలో హైలెట్ అవుతాయంటున్నారు. ఈమధ్య కాలంలో మహేశ్ ఏ సినిమాలోనూ ఈ రేంజ్ ఫైట్స్ చేయలేదట.

జేమ్స్ బాండ్ సినిమాల్ని స్ఫూర్తిగా తీసుకొని ఈ యాక్షన్ ఎపిసోడ్స్ తెరకెక్కిస్తున్నారు. తన ప్రతి సినిమాలో జేమ్స్ బాండ్ గూఢచారిగా కనిపిస్తాడు. ఈ సినిమాలో మహేష్ కూడా ఇంటలిజెన్స్ ఆఫీసర్ గా కనిపిస్తున్నాడు. కాబట్టి… జేమ్స్ బాండ్ తరహా యాక్షన్ సన్నివేశాలు ఇందులో ఉండబోతున్నాయి. దీపావళికి ఈ సినిమా టైటిల్ ను ప్రకటించడంతో పాటు… తెలుగు-తమిళ భాషల్లో ఒకేసారి టీజర్ ను విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు.

Loading...

Leave a Reply

*