సెల్ఫీ తీసుకుంటే సంతోషంగా ఉంటారుట‌

selfie-pic

సెల్ఫీలు ఎక్కువ‌గా తీసుకుంటే కుల్ఫీ అయిపోతారు….సెల్ఫీలు తీసుకునేవాళ్లు సెల్ఫిష్‌గా ఉంటారు… అతిగా సెల్ఫీలు తీసుకున్న‌వాళ్లు బాగుప‌డ్డ‌ట్టు చ‌రిత్ర‌లో లేదు…. ఇప్ప‌టిదాకా ఇలా భావించారు…. సెల్ఫీ పిచ్చి పీక్స్‌కు చేరిపోయింది… కొండ అంచు మీద‌కు వెళ్లి సెల్ఫీ దిగ‌డం… సింహాల‌కు షేక్‌హ్యాండ్ ఇస్తూ సెల్ఫీలు దిగ‌డం.. సాహ‌సాలు చేస్తూ సెల్ఫీలు దిగ‌డం, పులితో ప‌రాచికాలు ఆడుతూ ఫొటోలు దిగ‌డం లాంటివి చేస్తున్నారు….. ఇలా మీరు సెల్ఫీ పిచ్చోళ్ల‌యిపోతే సెల్ఫీ డెత్ ఖాయం అని ఇప్ప‌టిదాకా హెచ్చ‌రించారు మాన‌సిక నిపుణులు….సెల్ఫీ తీసుకుంటూ ప్ర‌మాద‌వ‌శాత్తూ చ‌నిపోయిన‌వాళ్ల‌ను ఎంతోమందిని చూపించి సెల్ఫీ గోల్ చేసుకోకండిరా నాయ‌నా అంటూ నెత్తినోరు బాదుకున్నారు… అయితే ఇదంతా త‌ప్ప‌ని ఇప్పుడు అధ్య‌య‌నాలు తేల్చేశాయి..సెల్ఫీ అంటే సంతోషం అని అర్థం అట‌…

మ‌నిషికి బీపీ రాకుండా హ్య‌పీగా ఉండాలంటే తాపీగా సెల్ఫీలు తీసుకోవాలిట‌… ఎన్నిసెల్ఫీలు తీసుకుంటే అంత సంతోషంగా ఉంటారుట‌…. న‌వ్వుతూ తుళ్లుతూ సెల్ఫీలు తీసుకుంటే మీరు ఆనందంగా ఉండే అవ‌కాశాలు మ‌రింత పెరుగుతాయిట‌…. అమెరికాలోని కాలిఫోర్నియా యూనివ‌ర్సిటీ నిర్వ‌హించిన అధ్య‌య‌నంలో ఈ విష‌యం వెల్ల‌డ‌యింది… కొన్ని వంద‌ల‌మంది విద్యార్థుల‌పై నాలుగు వారాల పాటు అధ్య‌య‌నం చేసి ఈ నిర్ధార‌ణ‌కు వ‌చ్చారు శాస్త్ర‌వేత్త‌లు… సెల్ఫీ దిగిన రోజున ఎంతో ఆనందంతో ఆత్మ‌విశ్వాసంతో గ‌డిపిన‌ట్టు విద్యార్థులు చెప్పారుట‌… సెల్ఫీలు తీసుకుంటే ఆత్మ‌సంతృప్తి క‌లిగి ఆనందంగా ఉంటారుట‌…సెల్ఫీల వ‌ల్ల ఇన్ని ప్ర‌యోజనాలు ఉంటాయ‌ని సైంటిస్టులు చెబుతున్నారు….

సెల్ఫీల గురించి సైంటిస్టులు ఇచ్చిన ఈ ట్విస్టు కొంద‌రికి మింగుడు ప‌డ‌క‌పోయినా సెల్ఫీలు తీసుకునేవాళ్ల‌కు ఎంతో ఆనందం క‌లిగిస్తోంది…సో… ఇక‌ముందు ఎవ‌రైనా సెల్ఫీ తీసుకుంటూ క‌నిపిస్తే మీ పిచ్చి పాడుగాను అన‌కండి… ఎంత సంతోషంగా ఉన్నారో అనుకుని మీరు కూడా సంతోషించండి.

Loading...

Leave a Reply

*