వాట్స‌ప్ కొత్త ఫీచ‌ర్ కెవ్వు కేక‌.. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఇండియాలోనే తొలిసారి…!

whatsapp

మెస్సేజింగ్ దిగ్గ‌జం వాట్స‌ప్ మ‌రో కొత్త ఫీచ‌ర్‌ని యూజ‌ర్‌ల‌కు అందిస్తోంది. వాట్స‌ప్ ప్రిస్టీజియ‌స్‌గా తీసుకున్న ఈ ఫీచ‌ర్‌ని ప్ర‌పంచ వ్యాప్తంగా మొద‌ట ఇండియాలోనే ప్ర‌వేశ పెట్టాల‌ని నిర్ణ‌యం తీసుకుంది. ఆ త‌ర్వాత ఈ సేవ‌ల‌ను మిగ‌తా 181 దేశాల‌కు విస్త‌రించాల‌ని భావిస్తోంది. వాట్స‌ప్‌లో వాయిస్ కాల్స్ స‌దుపాయం మాత్ర‌మే ఉంది. వీడియోకాల్స్ సౌక‌ర్యం లేదు. ఇటీవ‌ల చేసిన కొన్ని సాంకేతిక మార్పుల వ‌ల్ల వీడియో కాల్స్‌ను కూడా అందిస్తోంది. ఆండ్రాయిడ్‌, విండో ఫోన్ యూజర్‌లకు మొద‌ట అందుబాటులోకి తెచ్చింది. త్వ‌ర‌లోనే దీనిని అధికారికంగా ప్ర‌క‌టించ‌నుంది. లేటెస్ట్ వెర్ష‌న్‌ను అప్‌డేట్ చేసుకొని కాల్ సౌక‌ర్యంలోకి వెళ్లి వీడియో కాల్‌ను చేసుకోవ‌చ్చు

వాట్స‌ప్‌లో వాయిస్ కాల్ ఆప్ష‌న్ ప‌క్క‌నే వీడియో కాల్ ఆప్ష‌న్‌ను పొందు ప‌ర‌చ‌నున్నారు. ఈ ఫీచ‌ర్ అందుబాటులోకి వ‌స్తే.. ఒక‌రినొక‌రు చూసుకొని మాట్లాడుకోవ‌చ్చు. ఫ్రంట్ కెమెరాతోపాటు బ్యాక్‌కెమెరాతో కూడా ఈ కొత్త ఫీచ‌ర్‌ను వాడుకునే సౌల‌భ్యం ఉంది. ఈ ఆప్ష‌న్‌ అవ‌స‌రం లేద‌నుకుంటే మ్యూట్ చేసుకోవ‌చ్చు. ఇక‌, మిస్డ్‌కాల్ వ‌స్తే కూడా చూసుకోవ‌చ్చు.

ఈ ఫీచ‌ర్‌ని కూడా గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు. ఇప్ప‌టికే గూగుల్ కంపెనీ కాల్స్ కోసం డుయో ఆప్‌ని గ‌తంలోనే తీసుకొచ్చింది. దేశ రాజ‌ధాని ఢిల్లీలో త్వ‌ర‌లోనే ఈ కాల్ ఫీచ‌ర్‌ని లాంచ్ చేయ‌బోతోంది వాట్స‌ప్‌. ఇక్క‌డ యూజ‌ర్ల‌ను గ‌ణ‌నీయంగా పెంచుకోవాల‌నే ఆలోచ‌న‌తోనే ఇండియాలోనే లాంచ్ చేస్తోంది వాట్స‌ప్‌.

Loading...

Leave a Reply

*