వొడాఫోన్ ద‌స‌రా ఆఫ‌ర్‌.. పండ‌గ చేస్కో గురూ..!

vodafone

వోడాఫోన్ ద‌సరాకి బంప‌ర్ బొనాంజాలాంటి ఆఫ‌ర్ ప్ర‌క‌టించింది. రిల‌య‌న్స్ జియో ఎంట్రీతో మారిపోయిన డేటావార్‌ని మ‌రింత పెంచుతోంది వోడాఫోన్ సంస్థ‌. ఇప్ప‌టికే టెలికాం సంస్థ‌లు.. వాటి లాభాల‌ను ప‌క్క‌న‌పెట్టి.. వినియోగదారుల‌ను నిలుపుకునే ప్ర‌య‌త్నం చేస్తుండ‌గా.. వోడాఫోన్ ఎంట్రీతో అది మ‌రింత పెరుగుతోంది. ఎయిర్‌టెల్ త‌ర్వాత ఇండియాలో నెంబ‌ర్ టూ స్థానంలో ఉన్న వోడాఫోన్‌కి ఇటీవ‌ల క‌స్ట‌మ‌ర్ల సంఖ్య అంత‌గా పెర‌గ‌డం లేదు. దీంతో, ద‌సరా సీజ‌న్‌లో బంప‌ర్ ఆఫ‌ర్‌కి తెర‌లేపింది.

ఈ ఏడాది డిసెంబ‌ర్ 31 వ‌ర‌కు.. త‌మ వినియోగ‌దారులంతా వోడాఫోన్ ప్లే యాప్‌ని ఉచితంగా స‌బ్‌స్క్రైబ్ చేసుకోవ‌చ్చ‌ని ఆ సంస్త ప్ర‌క‌టించింది. ఈ యాప్‌లో 14వేల సినిమాలు, 180 టీవీ చానళ్లు, పెద్దసంఖ్యలో మ్యూజిక్ కేటలాగ్ ఉన్నాయి. ఇంతకుముందు ఇదే ఆఫర్‌ను 4జీ వినియోగదారులకు 3 నెలలు, 3జీ వినియోగదారులకు కేవ‌లం నెల‌మాత్ర‌మే ఫ్రీగా ప్ర‌క‌టించింది. తాజాగా దీనిని మూడు నెల‌ల పాటు త‌మ వినియోగ‌దారులంతా ఉపయోగించుకోవ‌చ్చ‌ని వివ‌రించింది.

రిలయన్స్ జియో ‘వెల్‌కమ్’ ఆఫర్‌లో భాగంగా డిసెంబరు 31 వరకు 10 ప్రీమియం యాప్స్‌ను ఉచితంగా ఉపయోగించుకోవచ్చని ఆఫ‌ర్ ఇచ్చింది. దీంతో వొడాఫోన్ తన కస్టమర్లను నిలుపుకునేందుకు తాజా ఆఫర్‌ను డెలివ‌ర్ చేసింద‌ట‌. స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు సినిమాలు, మ్యూజిక్ తదితరాల కోసం పలు యాప్ప్ డౌన్‌లోడ్ చేసుకునే అవసరం లేకుండా వోడాఫోన్ ప్లేలో అన్నింటినీ ఒకేదాంట్లో అందిస్తున్నట్టు వోడాఫోన్ వ‌ర్గాలు తెలిపాయి. మ‌రి, దస‌రా, దీపావ‌ళి ఒకేసారి చేసుకున్న‌ట్లుందా…? ఎంజాయ్ గురూ..!

Loading...

Leave a Reply

*