కోహ్లికంటే ఇత‌డే పోటుగాడ‌ట‌.. న‌మ్మేద్దామా..?

untitled-34

రీసెంట్‌గా ఇంగ్లాండ్ మాజీ ఫాస్ట్ బౌల‌ర్ ఆండ్రూ ఫ్లింటాఫ్ ఓ కామెంట్ చేశాడు. కోహ్లీ ఇలాగే ఆడుతూ పోతో త్వ‌ర‌లోనే మా రూట్‌ని అందుకుంటాడు అంటూ ఆయ‌న చేసిన వ్యాఖ్య క్రికెట్ వ‌ర్గాల్లో క‌ల‌క‌లం రేపింది. దీనికి బిగ్ బీ అమితాబ్ బ‌చ్చన్ స్ట్రాంగ్‌గా రిప్లై ఇచ్చారు. మీ రూట్ (వేరు) పీకుతాం అంటూ కామెంట్ చేశారు. దీనిని ప‌క్కన పెడితే.. అస‌లు రూట్‌కి అంత సీన్ ఉందా..? అనే చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి.

వ‌న్‌డేల‌లో కోహ్లీనే ది బెస్ట్‌. క్రికెట్ గాడ్ స‌చిన్ టెండూల్క‌ర్ కంటే గణాంకాల‌లో కానీ, సెంచ‌రీల విష‌యంలోని కానీ, పోరాడి టీమ్‌ని గెలిపించ‌డం, చేజింగ్ వంటి అంశాల‌లో కోహ్లీనే ముందున్నాడు. కానీ, టెస్ట్‌ల‌లో మాత్రం కోహ్లీ రూట్ కంటే కాస్త వెనుక బ‌డ్డాడ‌ని చెబుతున్నారు విశ్లేష‌కులు.

ఫ్లింటాఫ్ చెప్పిన‌ట్లు రూట్‌… కోహ్లీ కంటే ఎంతో ఎత్తులో అయితే లేడు కానీ.. మ‌న కోహ్లీకి స‌మ‌జోడీనే. ఈ త‌రం బెస్ట్ బ్యాట్స్‌మెన్‌లలో ఈయ‌న ఒక‌డని అన‌డంలో సందేహం లేదు. ముఖ్యంగా టెస్ట్ మ్యాచ్‌ల‌లో విరాట్‌ కంటే అతను మెరుగ్గా ఉన్నాడు కూడా. విశేషం ఏంటటే విరాట్‌, రూట్‌లిద్దరూ సరిగ్గా 48 టెస్టులే ఆడారు. ఇంగ్లాండ్‌ టెస్టు మ్యాచ్‌లు ఎక్కువ ఆడుతుంది కాబట్టి.. కోహ్లి కంటే రెండేళ్లు చిన్నవాడైనా, అతడి కంటే ఆలస్యంగా జట్టులోకి వచ్చినా.. కోహ్లితో సమానంగా మ్యాచ్‌లు ఆడగలిగాడు, ఎక్కువ పేరు తెచ్చుకోగలిగాడు రూట్‌. గణాంకాల్లో రూట్‌.. కోహ్లి కన్నా మెరుగ్గా ఉన్నాడు. కోహ్లి 45.56 సగటుతో 3554 పరుగులు చేస్తే.. రూట్‌ 53.28 సగటుతో 4103 పరుగులు చేయడం విశేషం.

రూట్‌కంటే కోహ్లీ సెంచ‌రీల‌లో ముందున్నాడు. ఇటు, రూట్ స్వదేశంలో ఎక్కువ మ్యాచ్‌లు ఆడడంతోనే ఆయ‌న స్ట్రైక్ రేట్‌, యావ‌రేజ్ ఎక్కువ‌గా ఉన్నాయ‌నే కామెంట్స్ కూడా ఉన్నాయి. అయితే, టెస్ట్ మ్యాచ్‌ల‌లో రూట్‌.. ఇంగ్లాండ్‌కి మ‌రిచిపోలేని విజయాల‌ను అందించాడు. కానీ, కోహ్లీ టెస్ట్ మ్యాచ్‌ల‌లో అలాంటి ఇన్నింగ్స్‌ల‌ను ఆడ‌లేదు. ముఖ్యంగా వ‌న్‌డేల స్థాయిలో విరాట్ విశ్వ‌రూపం టెస్ట్‌ల‌లో చూపించ‌లేక‌పోయాడనే కామెంట్స్ ఉన్నాయి విమ‌ర్శ‌కుల నుంచి. ప్ర‌స్తుతం ఇంగ్లాండ్ ఇండియాలో టూర్ చేస్తోంది. ఈ ప‌ర్య‌ట‌న‌లో ఈ ఇద్ద‌రిలో ఎవ‌రు గెలుస్తారో చూడాలి.

 

Loading...

Leave a Reply

*