జీయో ఉచితానికి ట్రాయ్ ఓకే!

jio

టెలికం రంగంలో పెను సంచ‌ల‌నం జియో ఉచిత ఆఫ‌ర్‌కు ట్రాయ్ ఆమోద ముద్ర ప‌డింది. త‌న వినియోగ‌దారుల‌కు లైఫ్‌టైం ఉచిత వాయిస్ కాల్స్ అందజేస్తామ‌ని ప్ర‌క‌టించిన రిల‌య‌న్స్ జియో ఆఫ‌ర్‌పై అభ్యంత‌రాలేమీ లేవ‌ని టెలికాం రెగ్యులేట‌రీ అథారిటీ పేర్కొంది. రిల‌య‌న్స్ అధినేత ముఖేశ్ అంబానీ నేతృత్వంలోని జియో టారిఫ్ ప్లాన్స్ ఇతర కంపెనీలపై ఆధిపత్య ధోరణిలో లేవని ట్రాయ్ వెల్ల‌డించింది. జియో ఆఫర్లు ట్రాయ్ మార్గదర్శకాలను ఉల్లంఘించడం లేదని స్ప‌ష్టం చేసింది.పేర్కొంది. అయితే జియో వినియోగ‌దారుల‌కు అనేక సేవలను ఉచితంగా ఇవ్వ‌డాన్ని మాత్రం ఈ ఏడాది చివరితో ముగించాలని ట్రాయ్ ఆదేశించింది. జియో ఆఫ‌ర్ దెబ్బ‌కు బెంబేలెత్తిన భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్ తదితర కంపెనీలు రిల‌య‌న్స్ సంస్థ‌పై ఫిర్యాదుల ప‌రంప‌ర మొద‌లెట్టిన సంగ‌తి తెలిసిందే.

జియో ఆఫ‌ర్‌లు ఇత‌ర పోటీ సంస్థ‌ల‌పై ఆధిప‌త్యం చెలాయించేలా ఉన్నాయ‌ని ఆయ‌న కంపెనీలు ట్రాయ్ దృష్టికి తెచ్చాయి. దీంతో జియో ప్ర‌క‌టించిన ఆఫ‌ర్లు, అది అమ‌లు చేయ‌నున్న ప‌థ‌కాల‌ను పరిశీలించిన ట్రాయ్ తాజా ఆదేశాలిచ్చింది. ఈ నేప‌థ్యంలో స్పందించిన జియో సంస్థ ట్రాయ్ తీర్పు తమకు గొప్ప విజయమని వెల్ల‌డించింది.

Loading...

Leave a Reply

*