ఆ క‌మెడియ‌న్‌కి పెద్ద నోట్ల క‌ల‌వరం.. 40శాతం వాటా ఇస్తానంటూ ఆఫ‌ర్‌లు.!

untitled-4-copy

ఆ క‌మెడియ‌న్ కాల్‌షీట్ దొరికితే.. ఏ నిర్మాత‌క‌యినా అది బంపర్ ఆఫ‌రే. ఇక‌, చిన్న సినిమాల నిర్మాత‌ల‌యితే ఆయ‌న కాల్‌షీట్ దొరికితే పండ‌గ చేసుకుంటారు. ఆయ‌న క్రేజ్‌, క‌రిష్మా అలాంటిది. అంత‌టి బిజీ ప‌ర్స‌న్ ఆ హాస్య‌న‌టుడు. తాజాగా ఆయ‌నే ప‌లువురికి బంప‌ర్ ఆఫర్‌లు ఇస్తాన‌ని వెంట‌ప‌డుతున్నాడ‌ట‌.మోదీ తీసుకున్న నిర్ణ‌యం బ్లాక్ మ‌నీ కేటుగాళ్ల‌ను ఏ మాత్రం వ‌ణికిస్తుందో తెలియ‌దు కానీ… టాలీవుడ్‌లోని పెద్ద‌లు మాత్రం బాగానే బెంబేలెత్తుతున్నార‌ట‌. ఇప్ప‌టికే ఓ బ‌డా హీరో ఇంట్లో దాదాపు 25 కోట్ల రూపాయ‌ల క్యాష్ ఉంద‌నే రూమ‌ర్ బ‌య‌ట‌కు వ‌చ్చింది.

ఓ నిర్మాత త‌న ద‌గ్గ‌రున్న న‌ల్ల‌ధనాన్ని మొత్తం విజ‌యవాడ‌కు పంపించి అక్క‌డ మార్చేసుకున్న‌ట్లు వార్తలు వ‌చ్చాయి. అయితే, ఓ అగ్ర క‌మెడియ‌న్ కూడా ఈ బాధితుల లిస్ట్‌లో చేరిపోయాడంటున్నారు.ఈ క‌మెడియ‌న్ బాగా సంపాదించాడ‌ట‌. బ‌డా హీరోల‌తో పోటీలు ప‌డీ రెమ్యూన‌రేష‌న్ తీసుకునే ఈ క‌మెడియ‌న్ ద‌గ్గ‌ర కొన్ని పదుల కోట్ల‌లో బ్లాక్ మ‌నీ ఉంద‌ట‌. రోజుకు 5-10 ల‌క్ష‌ల రూపాయ‌ల పారితోషికం తీసుకునే ఆ హాస్య‌న‌టుడు అదే పెట్టుబ‌డిని రియ‌ల్ ఎస్టేట్‌లో పెట్టాడ‌ట‌.

అటు, క్యాష్ కూడా కోట్ల‌లోనే ఉందంటున్నారు సినీ జ‌నాలు. దానిని మార్చుకునేందుకు ఆయ‌న విప‌రీతంగా ట్రై చేస్తున్నాడ‌ట‌. త‌న‌కు తెలిసిన వారికి, బ్రోక‌ర్ ఏజెంట్‌ల‌కు ఫోన్‌లు చేసి మ‌రీ త‌న మ‌నీ మార్చ‌మ‌ని అడుగుతున్నాడ‌ట‌. కుదిరితే 40శాతం కూడా ఇస్తాన‌ని చెబుతున్నాడ‌ట‌. అదీ లేదంటే చివ‌రికి 45 శాతానికి కూడారెడీఅంటూ దిగివ‌స్తున్నాడ‌ట‌. కాల్‌షీట్స్ ప‌రంగా పైసా త‌గ్గించ‌ని ఈ క‌మెడియ‌న్‌…మొత్తం క‌రెన్సీ మురిగిపోవ‌డం కంటే ఎంతో కొంత‌యినా ద‌క్కుతుంద‌ని భావిస్తున్నాడ‌ని స‌మాచారం. మ‌రి, ఆయ‌న ప్ర‌య‌త్నాలు ఎంత‌వ‌ర‌కు ఫ‌లిస్తాయో చూడాలి.

Loading...

Leave a Reply

*