విశాల్‌… ది రియ‌ల్ హీరో..!

vishal-copy

స్పందించే గుణం ఉండాలి.. కానీ, ఎంత డ‌బ్బుండి, ఎంత పెద్ద హీరో అయి ఉండి ఏం లాభం చెప్పండి..? పేద‌ల‌కు, అన్నార్తుల‌కు సాయం చెయ్య‌డంలో విశాల్ ఎప్పుడూ ముందుంటాడు. ఇప్ప‌టికే ఆయ‌న ఎన్నో సేవా కార్య‌క్ర‌మాల ద్వారా త‌న దొడ్డ మ‌న‌సు చాటుకున్నాడు. తాజాగా మ‌రోసారి త‌న విశాల హృద‌యం చాటుకున్నాడు విశాల్‌.కొన్ని రోజుల క్రితం.. చెన్నై న‌గ‌రంలో ఓ యువ‌కుడు త‌ప్ప‌తాగి ప‌ట్ట‌ప‌గ‌లు న‌డిరోడ్డుపై కాస్ట్ లీ కారుని వేగంగా న‌డిపి ఓ భారీ యాక్సిడెంట్ చేశాడు. ఈ ఘ‌ట‌న‌లో ఓ ఆటో డ్రైవ‌ర్ మృతిచెంద‌గా, ప‌లువురికి తీవ్ర‌గాయాల‌య్యాయి. ఇక‌, 13 ఆటోలు ధ్వంస‌మ‌య్యాయి. ఈ ప్రమాదంలో త‌మిళ‌నాడులోని తిరువ‌ళ్లూరు జిల్లా తిరుత్త‌ని తాలూకా అక్కూరు గ్రామానికి చెందిన ఆటోడ్రైవ‌ర్ ఆర్ముగం ఘ‌ట‌నా స్థ‌లంలోనే ప్రాణాలు కోల్పోయాడు. దీంతో, ఆ కుటుంబం రోడ్డున ప‌డింది.

ఆర్ముగం సంపాద‌నే వారి జీవనాధారం. ఆయ‌న మ‌ర‌ణంతో ఆ కుటుంబ స‌భ్యుల పోష‌ణ కూడా క‌ష్ట‌సాధ్యంగా మారింది. దీనిపై మీడియాలో వ‌చ్చిన క‌థ‌నాలు చూసి చలించిన విశాల్‌.. ఆ బాధ్య‌త‌ను తాను తీసుకున్నారు.ఆర్ముగం కూతురు మ‌నీషా (7) చ‌దువుల‌క‌య్యే ఖ‌ర్చును ఒక అన్న‌య్య‌గా భావించి తానే భరించ‌నున్న‌ట్లు తెలిపారు. అంతేకాదు, ఆ కుటుంబానికి ఆర్ధిక సాయంతో పాటు వారితో ఓ కిరాణా షాపు కూడా పెట్టించి.. వారికి ఆర్ధికంగా చేయూత‌నివ్వాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ఇలా, రోడ్డున ప‌డ్డ ఓ కుటుంబాన్ని ఆదుకోవ‌డంతో విశాల్ మంచి మ‌న‌సు మ‌రోసారి బ‌య‌ట‌ప‌డింది. ఆయ‌న‌ను ఇప్పుడు ది రియ‌ల్ హీరో అని ప్ర‌శంసిస్తున్నారు. అందుకే, ఎన్ని కోట్లున్నా ఏం లాభం చెప్పండి.. క‌ష్టాల‌లో ఉన్న‌ సాటి మ‌నిషికి సాయం చెయ్య‌క‌పోతే.

Loading...

Leave a Reply

*