వాట్సాప్ వీడియో కాల్‌కు ఎంత ఖ‌ర్చ‌వుతుందో తెలుసా..?

whatsapp

రోజు రోజుకి టెక్నాలజీలో మార్పులు రావడంతో, ప్రజలు కూడా వాటిని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అందులో భాగమే వీడియో కాల్. ఎక్కడో విదేశాల్లో ఉండే సన్నిహితులతో కూడా ప్రస్తుతం వీడియో కాల్లో మాట్లాడుతూ వారి గురించి తెలుసుకుంటున్నారు. అయితే ఇప్పటి వరకు బేటా టెస్టింగ్ లో మాత్రమే అందుబాటులో ఉండే వాట్సాప్ వీడియో కాల్ ను, ఇప్పడు అందరికీ అందుబాటులోకి తీసుకురానున్నట్టు ప్రకటించింది వాట్సాప్ సంస్థ.

వాట్సాప్ తీసుకున్న తాజా నిర్ణయంతో దాదాపు 100 కోట్ల మంది ప్రజలు ఎన్ క్రిప్టేడ్ వీడియో కాలింగ్ సదుపాయాన్ని ఉపయోగించుకోనున్నారు. అంతే కాకుండా వాట్సాప్ లాగానే మరో స్కైప్, ఫేస్ టైం లాంటి యాప్స్ కూడా యూజర్లకు వీడియో కాలింగ్ చేసుకునే సదుపాయాన్ని కల్పిస్తోందట.

వీడియో కాలింగ్ కు ఎంత ఖర్చు అవుతుందంటే..

యాపిక్ ఫేస్ టైం యాప్ ద్వారా 4 నిమిషాల వీడియో కాల్ కు దాదాపు 8.8 ఎంబి డేటా వరకు ఖర్చు అవ్వచ్చు అంటున్నారు. అదే స్కైప్ యాప్ ద్వారా అయితే 4 నిమిషాల వీడియో కాల్ కు దాదాపు 12.3 ఎంబి డేటా వరకు అవుతుందని, అలాగే వాట్సాప్ ద్వారా చేసే వీడియో కాల్ కు 4 నిమిషాలకు 12.74 ఎంబి డేటా వరకు ఖర్చు అవ్వచ్చని చెప్తున్నారు. సో..వీడియో కాల్స్ కు ఎంత ఖర్చు అవుతుందో తెలుసుకున్నారు కదా..ఎంజాయ్ యువర్ వీడియో కాలింగ్..

Loading...

Leave a Reply

*