ఆ పాప రెండుసార్లు పుట్టింది

papa

ప్ర‌పంచంలో ఎవ‌రైనా రెండుసార్లు పుడ‌తారా?…. ఎవ‌రైనా రెండుసార్లు జ‌న్మించ‌గ‌లరా….ఏ త‌ల్ల‌యినా బిడ్డ‌కు ఒక్క‌సారే జ‌న్మ‌నిస్తుంది.. కానీ ఆ త‌ల్లి ఒక్క‌బిడ్డ‌నే రెండుసార్లు క‌న్న‌ది… అంటే ఆ పాప రెండుసార్లు పుట్టింది… రెండుసార్లు జ‌న్మించింది… అమ్మ క‌డుపులో నుంచి రెండుసార్లు బ‌య‌ట‌కువ‌చ్చి ఈ లోకాన్ని చూసింది… విన‌డానికి వింత‌గా ఉన్నా ఇది నిజం… ఆ పాప‌కు రెండు జ‌న్మ‌లు ఉన్నాయి… అమెరికాలోని టెక్సాస్ చిల్డ్ర‌న్ హాస్పిట‌ల్‌లో ఈ అరుదైన సంఘ‌ట‌న జ‌రిగింది… ఈ న‌మ్మ‌లేని నిజం చోటుచేసుకుంది…. టెక్సాస్‌కు చెందిన ఓ గ‌ర్భిణి ప్ర‌స‌వ వేద‌న‌తో ఆ ఆస్ప‌త్రిలో చేరింది… అయితే చికిత్స చేస్తున్న వైద్యుల‌కు అమె క‌డుపులో బిడ్డ ట్యూమ‌ర్‌తో పాటు పెరిగిన‌ట్లు గుర్తించారు..

దీంతో త‌ల్లి క‌డుపులో ఉండ‌గానే బేబీని బ‌య‌ట‌కు తీసి ఆ ట్యూమ‌ర్‌ను తొల‌గించారు. ట్యూమ‌ర్ వ‌ల్ల బిడ్డ గుండె దాదాపు ఆగినంత ప‌న‌యింది… ఆ స‌మ‌యంలో బిడ్డ‌ను బ‌య‌ట‌కు తీస్తే ప్రాణాల‌కే ప్ర‌మాద‌మ‌ని భావించి మ‌ళ్లీ ఆ బిడ్డ‌ను గ‌ర్భాశ‌యంలోకి పంపించారు… అమ్మ క‌డుపులో పెట్టేశారు… ఓ బుజ్జి పాపాయి గ‌ర్భ‌గుడిలో చ‌ల్ల‌గా ఉండ‌వోయి అంటూ అమ్మ క‌డుపులో దాచేశారు.. గ‌ర్భాశ‌యంలో పెట్టి కుట్లు వేసేశారు.. ఆ త‌ర్వాత కొన్నాళ్ల‌కు అంటే 13 వారాల త‌ర్వాత త‌ల్లికి శ‌స్త్ర‌చికిత్స చేసి బిడ్డ‌ను త‌ల్లి క‌డుపులో నుంచి బ‌య‌ట‌కు తీశారు.. క్షేమంగా డెలివ‌రీ చేశారు…ఈ అరుదైన చికిత్స‌కు సంబంధించిన వీడియోను యూట్యూబ్‌లో పోస్టు చేశారు..

వైద్యుల శ‌స్త్ర‌చికిత్స విజ‌య‌వంతం కావ‌డంతో చిన్నారి పాప ముద్దులొలికిస్తోంది… వైద్య నారాయ‌ణుల చేతి చ‌ల‌వ‌తో రెండుసార్లు పుట్టిన ఆ చిన్నారి పాపాయి ఇప్పుడు చిరున‌వ్వులు మూట‌గ‌ట్టేలా కిల‌కిలా న‌వ్వుతోంది.

Loading...

Leave a Reply

*