విండీస్ క్రికెట‌ర్‌తో ల‌వ్‌లో తెలుగు హీరోయిన్‌?

untitled-17

సంప్ర‌దాయ‌బ‌ద్ధంగా ఉండే తెలుగు హీరోయిన్ హ‌ద్దులు దాటిందిట‌… ఓ క్రికెట‌ర్‌తో ముద్దుముచ్చ‌ట్ల‌లో మునిగితేలుతోందట‌…అది కూడా వెస్టిండీస్ క్రికెట‌ర్‌తో తెలుగు హీరోయిన్ డేటింగ్ చేస్తోంద‌నే వార్త‌లు క‌ల‌క‌లం రేపుతున్నాయి…. సంచ‌ల‌నం సృష్టిస్తున్నాయి…. ఆమె విసిరిన ల‌వ్ బాల్స్‌కు నో చెప్ప‌లేక విండీస్ క్రికెటర్ క్లీన్‌బౌల్డ్ అయిపోయాట్ట‌…. ల‌వ్ పిచ్‌పై ఆమె విసిరే ప్రేమ బంతుల‌ను అత‌డు జోరుగా బ్యాటింగ్ చేస్తున్నాట్ట‌… ఆ హీరోయిన్ దాదాపు ద‌శాబ్దం పాటు తెలుగు ఇండ‌స్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా స‌త్తా చాటింది… ఆమె మ‌రెవ‌రో కాదు హాట్ హీరోయిన్‌ శ్రియ‌…… తెలుగుతో పాటు త‌మిళ‌, హిందీ భాష‌ల్లోనూ సినిమాలు చేసిన శ్రియ ఇప్పుడు త‌న వ‌య‌సుకు త‌గ్గ పాత్ర‌ల కోసం, అవ‌కాశాల కోసం ఎదురుచూస్తోంది….వెండితెర‌పై అవ‌కాశాలు రాక‌పోయినా ర్యాంప్‌షోలు, ఓపెనింగ్ ఈవెంట్ల‌తో కాలం గ‌డిపేస్తోంది…

అయితే ఆమె ఖాళీగా కూర్చోవ‌డం దేనిక‌ని భావించిందో ఏమో ఓ వెస్టిండీస్ క్రికెట‌ర్‌తో డేటింగ్ షురూ చేసిందని వార్త‌లు వ‌స్తున్నాయి.. ఈ ముద్దుగుమ్మ కు సంబంధించిన ఈ తాజా వార్త టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది… ఇన్నేళ్ల కెరీర్‌లో ఇంత‌వ‌ర‌కు ఏ స్టార్‌తో శ్రియాకు రిలేష‌న్ ఉన్న‌ట్టుగా వార్త‌లు రాలేదు… తాజాగా వెస్టిండీస్‌కు చెందిన ఓ క్రికెట‌ర్‌తో ఈ బ్యూటీ స‌న్నిహితంగా ఉంటోంద‌న్న వార్త సౌత్ సినిమా ఇండ‌స్ట్రీలో వేడి పుట్టిస్తోంది….ఇటీవ‌ల వెస్టిండీస్ క్రికెట‌ర్ బ్రావోతో క‌లిసి ముంబైలోని ఓ రెస్టారెంట్‌లో నుంచి బ‌య‌ట‌కు వ‌స్తున్న శ్రియ ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.. దీంతో శ్రియ‌, బ్రావోల మ‌ధ్య ఏదో ఉంద‌న్న ప్ర‌చారం జోరుగా సాగుతోంది.. అయితే త‌న రిలేష‌న్‌పై శ్రియ పెద‌వి విప్పుతుందో లేదో చూడాలి.

Loading...

Leave a Reply

*