క‌పిల్ దేవ్ త‌ర్వాత‌.. ఇండియాకి ఈ యువ క్రికెట‌రే ది బెస్ట్‌ ఆల్‌రౌండ‌ర్‌..!

kapil-dev

ఆరో ప్లేస్‌లో ధీటుగా ఆడే బ్యాట్స్‌మెన్ కోసం భార‌త్ ఎదురు చూస్తోంది. త్వ‌ర‌లోనే ధోని రిటైర్ అవుతార‌నే అంచ‌నాల‌తోపాటు ఆ స్థానం ఏ టీమ్‌కయినా కీల‌కం. ఇటు టాప్ ఆర్డ‌ర్‌ని, అటు లోయ‌ర్ ఆర్డ‌న్‌ని కాపాడుకుంటూ, వారితో స‌మ‌న్వ‌యం చేసుకుంటూ ధీటుగా బ్యాటింగ్ చేసే స‌త్తా ఉన్న ఆట‌గాడు కావాలి. అలాంటి ప్లేయ‌ర్ కోసం ఇండియా ఎదురు చూస్తోంది. ఇటీవ‌ల ఎంతో మంది వ‌చ్చినా వారెవ‌రూ నిల‌క‌డగా రాణించ‌లేక‌పోతున్నారు. మ‌రోవైపు, ఇండియాకి స‌రైన ఆల్‌రౌండ‌ర్ కూడా లేడు. ఇది కూడా టీమిండియాని తీవ్రంగా వేధిస్తోంది.

అందుకే, సెలక్ష‌న్ క‌మిటీ ఓ షాకింగ్ డెసిష‌న్‌ను తీసుకుంది. రీసెంట్‌గా ముగిసిన న్యూజిలాండ్ సిరీస్‌లో ఎంట్రీ ఇచ్చిన హార్దిక్ పాండ్యాను ఇంగ్లండ్‌తో జ‌ర‌గ‌బోయే టెస్ట్ సిరీస్‌కి ఎంపిక చేసింది. ఈ నిర్ణ‌యం క్రికెట్ ల‌వ‌ర్స్‌ను విస్మ‌యానికి గురి చేసింది. దీనిపై చీఫ్ సెల‌క్ట‌ర్ ఎమ్ఎస్‌కే ప్ర‌సాద్‌ని ప్ర‌శ్నించ‌గా.. కపిల్ దేవ్ తర్వాత అంతటి ఖచ్చితమైన ఆల్ రౌండర్ కోసం ప్రయత్నిస్తున్నామని, అందుకే కొత్త వారికి అవకాశమిస్తున్నామని తెలిపారు.

ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్‌లో ముగ్గురు స్పిన్నర్లతో ఆడితే పాండ్యా రెండో సీమర్‌గా వ్యవహరించడంతో పాటు బ్యాటింగ్ కూడా చేయగ‌ల‌డ‌ని ఎమ్ఎస్‌కే అభిప్రాయ ప‌డ్డారు. ద్ర‌విడ్, కుంబ్లే శిక్షణలో పాండ్యా పరిణితి చెందాడని కూడా ప్రసాద్ అన్నారు. నిజానికి ఆల్‌రౌండర్ స్థానంలో అంతకుముందు స్టువర్ట్ బిన్నీని పరీక్షించింది సెలక్షన్ కమిటీ. కానీ బిన్ని అంతగా ఆకట్టుకోకపోవడంతో మార్పులు మొదలుపెట్టింది. మ‌రి, హార్దిక్ పాండ్యా అయినా రాణిస్తాడా? లేదా? అనేది ఇంట‌రెస్టింగ్‌గా మారింది.

Loading...

Leave a Reply

*