పెళ్లి చ‌దివింపుల్లో స్వైపింగ్ మెషీన్‌.. వాట్ ఆన్ ఐడియా స‌ర్‌జీ…!

untitled-13

ఒక ఐడియా మ‌న జీవితాన్నే మార్చేస్తుంది. పెద్ద నోట్ల ర‌ద్దుపై మోదీ తీసుకున్న నిర్ణయం ఎలాంటి ఫ‌లితాల‌ను ఇస్తుందో తెలియ‌దు కానీ… జ‌నాల క‌ష్టాలు చెప్పుకున్నా తీరేలా లేవు. చిల్ల‌ర కోసం జ‌నాలంతా రోడ్ల‌మీద‌కు వ‌చ్చారు. దాని సంగ‌తి ప‌క్క‌న పెడితే.. కొన్ని చోట్ల పెళ్లిళ్ల‌కు బాగా ఇబ్బందిగా మారింది. పెళ్లి ప‌నులు ద‌గ్గ‌రుండి చూసుకోవాల్సిన వ‌రుడు, వ‌ధువు కుటుంబీకులు, బంధువులు బ్యాంక్‌ల బాట ప‌డుతున్నారు. పెళ్లి ఖ‌ర్చుల కోసంవారు ప‌డ‌రాని పాట్లు ప‌డుతున్నారు. కొన్ని చోట్ల తూతూమంత్రంగా పెళ్లిళ్ల‌ను జ‌రిపిస్తున్నారు చాలా చోట్ల‌.

ఇదంతా ఒక‌వైపు మాత్ర‌మే. రెండో వైపు చూస్తే.. పెళ్లికి రావాల్సిన అతిథులు, బంధువులు రావ‌డానికి చిల్ల‌ర దొర‌క‌డం లేదు. ఇటు, పెళ్లి అక్క‌డ చ‌దివింపుల‌కు చేతిలో డ‌బ్బులు ఉండ‌డం లేదు. దీంతో, తమిళ‌నాడులోని ఓ కుటుంబం పెళ్లిలో స‌రికొత్త ప్ర‌యోగానికి తెర‌దీసింది. ఓ స్వైపింగ్ మెషీన్ తెచ్చి చ‌దివింపులు చేసుకోవ‌చ్చ‌ని తెలిపింది. చ‌దివింపుల‌కు నోట్ల‌తో ఇబ్బందులు ఎదుర‌వుతుండ‌డంతో చ‌దివింపులు మిస్ కాకుండా ఆ పెళ్లి వారు చ‌దివింపుల వ‌ద్ద స్వైపింగ్ మిష‌న్ ఏర్పాటు చేశారు. అక్క‌డ‌కు వ‌చ్చిన వారు స్వైపింగ్ మిష‌న్ వ‌ద్ద‌కు వెళ్లి చ‌దివింపులు చ‌దివించారు. దీంతో ఈ పెళ్లికి వెళ్లిన వారికి ఏం చ‌దివించ‌లేక‌పోయాం అన్న బెంగ తీరింది.

ఈ పెళ్లికి వెళ్లిన వారంతా వాట్ యాన్ ఐడియా సర్ జీ అని అంటున్నారు. సోషల్ మీడియాలో అయితే ఈ పెళ్లి స్వైపింగ్ మిషన్ గురించి నయా ట్రెండ్..అని కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇక భ‌విష్య‌త్తులో ఈ కొత్త ట్రెండ్ కంటిన్యూ అయ్యే ఛాన్సులు పుష్క‌లంగా ఉన్నాయి.

Loading...

Leave a Reply

*