ఉద‌య‌భానుకి ఊహించ‌ని రిటార్ట్ ఇచ్చిన సునీత..!

untitled-21

రెండు నెల‌ల క్రితం ఉద‌య‌భాను ఓ ఇంట‌ర్‌వ్యూలో సింగ‌ర్ సునీత‌పై ఊహించ‌ని కామెంట్స్ చేసింది. ఓ టాప్ సింగ‌ర్ త‌న‌ను స్టేజ్‌పైకి పిల‌వ‌కుండా అవ‌మానించింద‌ని, దానికి ఏడుపు కూడా వ‌చ్చింద‌ని వివరించింది. అంతేకాదు, పిల‌వ‌క పోయినా.. తనంత‌ట తానే స్టేజ్ మీద‌కు వెళుతుంటే.. మ్యూజిషియ‌న్‌లు శాడ్ మ్యూజిక్ ప్లే చేశార‌ని, ఇది త‌న‌కు మ‌రింత అవ‌మానంగా భావించాన‌ని తెలిపింది. అయితే, ఎక్క‌డా సునీత పేరు చెప్ప‌లేదు. అయితే, ఆమె చెప్పిన వివ‌రాల ప్ర‌కారం ఆ సింగ‌ర్ ఎవ‌రో కాదు.. సునీత అని అంద‌రికీ అర్ధం అయింది.

ఇది జ‌రిగి దాదాపు రెండు నెల‌లయింది. ఇన్నాళ్ల‌కు దీనిపై స్పందించిన సునీత.. ఉద‌య‌భాను కామెంట్స్‌పై వివ‌ర‌ణ ఇచ్చింది. ఆ మ‌ధ్య ఓ పేప‌ర్‌లో ఉద‌య‌భాను ఇంట‌ర్‌వ్యూ చ‌దివాను. నా పేరు ప్ర‌త్యక్షంగా చెప్ప‌క‌పోయినా.. ఆమె చెప్పింది నా గురించి అని అర్ధ‌మ‌యింది. నిజానికి ఉద‌య‌భాను న‌న్ను తప్పుగా అర్ధం చేసుకుంది. ఆ ప్రోగ్రామ్ పూర్తిగా నాది. దానికి ర‌మ్మ‌ని నేను పిల‌వ‌లేదు. ఆర్గ‌నైజ‌ర్లు ఇన్విటేష‌న్‌లు పంపించారు. అలాంటప్పుడు నేనెందుకు ర‌మ్మ‌ని పిలుస్తాను..? ఇక‌, ఆమె స్టేజ్ మీద‌కు వ‌స్తున్న‌ప్పుడు నా మ్యూజిక్ టీమ్ శాడ్ ట్యూన్ ప్లే చేశార‌ని ఉద‌య‌భాను చెప్పింది. అది నాకు గుర్తు లేదని వివ‌రించింది సునీత.

అంతేకాదు, ఆ షో త‌ర్వాత ఉద‌య‌భాను, సునీత చాలా సార్లు మీట్ అయ్యార‌ట‌. అయితే, ఎప్పుడూ ఉద‌య‌భాను త‌న‌తో ముభావంగా ఉండేద‌ని, తాను ప‌లుక‌రించినా అంత‌గా మాట్లాడేది కాద‌ని తెలిపింది. రీసెంట్‌గా ఉద‌య‌భాను ఇంట‌ర్‌వ్యూ చ‌దివిన త‌ర్వాత అస‌లు మేట‌ర్ అర్ధం అయింద‌ని, అయినా ఇంత చిన్న విష‌యాన్ని కూడా ఆమె మ‌న‌సులో పెట్టుకోవ‌డం విచిత్రంగా ఉంద‌ని వివ‌ర‌ణ ఇచ్చింది సునీత. అంటే, ఇక్క‌డ త‌న‌ను అపార్దం చేసుకోవ‌డమే త‌ప్ప జ‌రిగిన దాంట్లో త‌న‌త‌ప్పులేద‌ని వివ‌ర‌ణ ఇచ్చింది. అయితే, ఉద‌య‌భాను ఇంట‌ర్‌వ్యూ చ‌దివిన వారు.. క‌నీసం సునీత నుంచి ఏదో చిన్న ఊర‌డింపు మాట వ‌స్తుంద‌ని భావించార‌ట‌. అలాంటిదేమీ రాక‌పోవ‌డంతో ఇద్ద‌రి మ‌ధ్య గ్యాప్ మ‌రింత పెర‌గ‌డం గ్యారంటీ అంటున్నారు ఫిలిం న‌గ‌ర్ వ‌ర్గాలు.

Loading...

Leave a Reply

*