టీటీడీ ప్ర‌ధాన అర్చ‌కులు తిరుమ‌ల గుడిలో ఏం చేశారో తెలుసా..?

ramana-dhikshitulu-ttd

ర‌మ‌ణ దీక్షితులు.. టీటీడీ ప్ర‌ధాన అర్చ‌కులు. ఆయ‌న క‌లియుగ దైవం శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామి గుడిలో నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా వ్య‌వ‌హరించారు. ఆల‌య ప‌విత్ర‌త‌ను, నియ‌మ నిబంధన‌ల‌ను తూచా తప్ప‌క పాటించే ర‌మ‌ణ దీక్షితులు.. టీటీడీ నిబంధ‌న‌ల‌ను తుంగ‌లో తొక్క‌డం విశేషం.

ఇంత‌కీ ఆయ‌న ఏం చేశారంటే… తిరుమ‌ల‌లో ఇటీవ‌ల జ‌రిగిన బ్ర‌హ్మోత్స‌వాల సమ‌యంలో త‌న మ‌న‌వ‌డిని నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా ఆల‌య ప్ర‌వేశం చేయించార‌ట‌. దీనిపై టీటీడీ బోర్డ్‌కు అప్పుడే ఫిర్యాదు వ‌చ్చినా బ్ర‌హ్మోత్స‌వాల స‌మ‌యం కావున ఎలాంటి చ‌ర్య తీసుకోలేద‌ట‌. తాజాగా బ్ర‌హ్మోత్స‌వాల హ‌డావిడి ముగియడంతో టీటీడీ బోర్డ్ దీనిపై చ‌ర్య‌కు ఉప‌క్ర‌మించింది. త‌న మ‌న‌వ‌డికి అనుమ‌తి లేకుండా ఎందుకు గ‌ర్భ‌గుడిలోకి తీసుకుపోయారో వివ‌ర‌ణ ఇవ్వాల‌ని షోకాజ్ ఇచ్చింది. దీనిపై వివ‌ర‌ణ ఇవ్వాల‌ని ఆదేశించింది. ఆయ‌న ఇచ్చిన వివ‌ర‌ణకు అనుగుణంగా చ‌ర్య‌లు వుండే అవ‌కాశం ఉంది. ఇది నిజ‌మేన‌ని తేలితే ఆయ‌న‌పై బోర్డ్ ఎలాంటి చ‌ర్య‌లు తీసుకుంటుందో చూడాలి.

Loading...

Leave a Reply

*