జియోపై ఊహించని స‌ర్వే.. సిమ్ ఎందుకు తీసుకున్నాం అని బాధ ప‌డుతున్నార‌ట‌..!

jio

రిల‌య‌న్స్ జియో మార్కెట్‌లోకి ఎంట‌ర‌యిందో లేదో కార్పొరేట్ ప్ర‌పంచం ఉలిక్కిప‌డింది. ముఖ్యంగా మొబైల్ నెట్ వ‌ర్క్ ప్ర‌పంచం ఒక్క‌సారిగా షేక్ అయింది. దీంతో దేశంలో డేటాగిరి వ‌స్తుంద‌ని భావించారు. జియో వెల్క‌మ్ ఆఫర్‌కి పోటీగా ఎయిర్‌టెల్‌, వోడాఫోన్‌, ఐడియా వంటి కంపెనీలు కూడా పోటీలు ప‌డి ఆఫ‌ర్‌లు ప్ర‌క‌టించాయి. ఇక‌, బీఎస్ఎన్ఎల్ అయితే ఆఫ‌ర్‌ల మీద ఆఫ‌ర్‌లు కుమ్మ‌రించింది. గ్రామీణ ప్రాంతాల‌లో త‌న నెట్‌వ‌ర్క్‌ను, క‌స్ట‌మ‌ర్‌లను కాపాడుకునే ప్ర‌య‌త్నం చేసింది.

ఇంత చేసినా.. జియో సంచ‌ల‌నం కేవ‌లం మాట‌ల‌కే ప‌రిమిత‌మ‌యిందనే టాక్ న‌డుస్తోంది. ఆ సిమ్ తీసుకున్న వారు మొద‌ట్లో ఉన్నంత హ్యాపీగా ఇప్పుడు లేర‌నే ప్ర‌చారం న‌డుస్తోంది. రీసెంట్‌గా ప్ర‌ముఖ బ్రోక‌రేజ్ సంస్థ మోతీలాల్ ఓస్వా నిర్వ‌హించిన ఓ స‌ర్వేలా జియోపై షాకింగ్ ఫీడ్ బ్యాక్ వ‌చ్చింద‌ట‌. ఆ స‌ర్వేలో వినియోగ‌దారులు జియోపై అసంతృప్తిగా ఉన్నారు. నెట్ వ‌ర్క్ స్పీడ్‌ మొద‌ట్లో ఉన్న‌ట్లు నేడు లేద‌ని, దారుణంగా ప‌డిపోయింద‌ని చెప్పారు. నెట్ వ‌ర్క్ క్వాలిటీ కూడా బాగా త‌గ్గిపోయింద‌ని చెబుతున్నారు. ప్ర‌స్తుతం ఫ్రీ ఆఫ‌ర్ కావున స‌ర్వీస్‌ని కొన‌సాగిస్తున్నామ‌ని లేదంటే తీసివేసేవాళ్ల‌మ‌ని కొందరు చెప్ప‌గా, మ‌రికొంద‌రు మాత్రం వెల్క‌మ్ ఆఫర్ అయిపోయిన వెంట‌నే దీనిని సెకండ్ సిమ్‌గా వాడుకుంటామ‌ని, ఫ‌స్ట్ సిమ్ మాత్రం అయ్యే చాన్స్ లేద‌నే అభిప్రాయం వ్య‌క్తం చేశారు.

రిల‌య‌న్స్ జియో కంటే జ‌నాలు ఎక్కువ‌గా ఎయిర్‌టెల్ నెట్ వ‌ర్క్‌నే ఇష్ట‌ప‌డుతున్నార‌ట‌. నెట్‌వ‌ర్క్‌లోగానీ, డేటా సేవ‌ల్లో కానీ, జియోకి ఎయిర్‌టెల్ ప్ర‌ధాన పోటీదారుగా అవుతుంద‌ని భావిస్తున్నారు. రెండో స్థానం జియోదేన‌ట. వోడాఫోన్‌, ఐడియా, టాటా డొకెమొ వంటి స‌ర్వీసులన్నీ వీటి త‌ర్వాతేన‌ట‌. త్వ‌ర‌లో జియోపై రిల‌య‌న్స్ భారీగా పెట్టుబ‌డులు పెట్టి నెట్‌వ‌ర్క్‌ను మ‌రింత క్లారిటీ పెంచుకోవాల‌ని భావిస్తోంద‌ట‌. అప్పుడు ఎయిర్‌టెల్ కంటే జియోనే ముందుంటుంద‌ని భావిస్తున్నారు.

Loading...

Leave a Reply

*