జియో గురించి జ‌నం అనుకుంటున్న నిజాలు తెలిస్తే షాక్‌

jio

ఇండియ‌న్ టెలికం రంగంలోకి ముఖేష్ అంబానీ రిలయ‌న్స్ జియో తుఫాన్‌లా దూసుకువ‌చ్చింది… ఫ్రీ కాల్స్‌, ఫ్రీ డేటా అంటూ జ‌నానికి ఫీవ‌ర్ తెప్పించింది… జియో డేటాగిరీకి జన గులాంగిరీ చేస్తున్నారు.. జ‌య‌హో జియో అంటున్నారు… జైజై జియో అన్న జ‌నం మిగిలిన నెట్‌వ‌ర్క్‌ల‌కు బైబై అన్నారు.. దీంతో వాళ్లు కూడా దిగివ‌చ్చి జియోకి జేజ‌మ్మ‌లాంటి ఆఫ‌ర్లు ప్ర‌క‌టించారు.. ఈ ఆఫ‌ర్ల‌తో జ‌నానికి దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయిపోయింది.. ఈ నేప‌థ్యంలో అస‌లు జియో గురించి జ‌నం ఏమ‌నుకుంటున్నారో తెలుసుకోవ‌డానికి బ్యాంక్ ఆఫ్ అమెరికా మెర్రిల్ లించ్ అనే సంస్థ ఓ స‌ర్వే చేసింది….. ఆ స‌ర్వే వివ‌రాలు చూస్తే జనంతో పాటు జియోకి కూడా షాక్ త‌గిలేలా ఉంది…చాలామంది జియో వినియోగ‌దారులు జియోకి రెండో స్థాన‌మే ఇస్తున్నారు.. అంటే జియోని రెండో సిమ్ముగా మాత్ర‌మే వాడుతున్నారు..

ప్ర‌తి వెయ్యిమంది వినియోగ‌దార్ల‌లో 56 శాతం మంది జియోని రెండో సిమ్‌కార్డుగా ఉప‌యోగిస్తూ దాన్ని సెకండ్‌హ్యాండ్‌గా చూస్తున్నారు… కేవ‌లం 24 శాతం మాత్ర‌మే జియోకి తొలి ప్రాధాన్య‌త ఇస్తున్నారుట‌… అసలు జియో ఎలా ప‌నిచేస్తుందో చూద్దామ‌ని మ‌రో 11 శాతం దాన్ని వాడుతున్నారుట‌. డాంగిల్‌, మిఫ్పిల్లో జియో సిమ్ముల‌ను ఉప‌యోగిస్తున్నారు…. 9 శాతం అయితే జ‌న్మ‌లో జియో ముఖం చూడ‌ద‌నుకుంటున్నారుట‌..జియోని ఏ ప‌ద్ధ‌తిలో ఉప‌యోగించ‌కూడ‌ద‌ని భావిస్తున్నారు.. అంటే మొబైల్ వినియోగ‌దారుల్లో కేవ‌లం 24 శాతం మాత్ర‌మే జియోకి జైజై కొడుతున్నారు… మిగిలిన 76 శాతం నైనై అంటున్నారు….

అంతేకాదు అన్నఅంబానీ కంపెనీయే కాదు త‌మ్ముడు అనిల్ అంబానీ కంపెనీ రిల‌య‌న్స్ క‌మ్యూనికేష‌న్స్‌, ఎయిర్‌సెల్‌ను కూడా చాలామంది వినియోగ‌దారులు చీద‌రించుకుంటున్నారుట‌…. స‌ర్వీస్ బాగోలేనందున వాళ్ల‌లో చాలామంది జియోకి మారిపోవాల‌ని చూస్తున్నారుట‌.. 95 శాతం వినియోగ‌దారులు త‌మ పాత ఆప‌రేట‌ర్‌నే కొన‌సాగించ‌డానికి మొగ్గు చూపుతున్నారు.. జియో వ‌చ్చినా తాము నెట్‌వ‌ర్క్ మార్చ‌మ‌ని తెగేసి చెబుతున్నారు… మొత్తానికి ఈ స‌ర్వే జియోకి దిమ్మ‌తిరిగే షాక్ ఇచ్చింది.

 

Loading...

Leave a Reply

*