0.2654 సెక‌న్‌ల తేడా ర‌నౌట్‌.. క్రికెట్ చ‌రిత్ర‌లోని హైలైట్స్‌లో ఒక‌టి…!

run-out

ఒక్క ర‌నౌట్ ఆస్ట్రేలియా జాతకాన్నే మార్చేసింది. క్రికెట్ చ‌రిత్ర‌లో క‌ల‌కాలం నిలిచిపోయే ర‌నౌట్‌గా ఇది ప్ర‌సిద్ధికి ఎక్కుతోంది. ఆస్ట్రేలియా-సౌత్ ఆఫ్రికా మ‌ధ్య జ‌రుగుతున్న తొలి టెస్ట్‌లో దక్షిణాఫ్రికా ఆట‌గాడు బావుమా అద్బుత‌మైన డైవ్‌తో చేసిన ర‌నౌట్‌.. ఆస్ట్రేలియాని ప‌రాజ‌య‌పు బాట ప‌ట్టించింది. మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది.

ఆస్ట్రేలియా ఓపెన‌ర్ డేవిడ్ వార్న‌ర్‌… లేని ప‌రుగు కోసం బ్యాటింగ్ ఎండ్ లోకి వెళుతున్న సమయంలో బావుమా బౌలర్ ఎండ్ నుంచి పరుగెత్తుకొచ్చి బంతిని అందుకున్నాడు. అంతే వేగంగా బంతిని సూటిగా వికెట్లవైపు విసిరాడు. దాంతో బెయిల్స్ కిందపడటం, వార్నర్ అవుట్ కావడం చకచకా జరిగిపోయాయి.

తొలుత వార్నర్ సులువుగా క్రీజ్ లోకి వెళతాడని భావించినా.. రెప్పపాటులో బావుమా చేసిన రనౌట్ తో వార్నర్ సైతం ఆశ్చర్యపోయాడు. అయితే ఆ రనౌట్ చేయడానికి పట్టిన సమయం 0.264 సెకండ్లుగా నమోదు కావడంతో, కాసేపు తమ దేశ మాజీ జాంటీ రోడ్స్ ను బావుమా జ్ఞప్తికి వచ్చాడు.

ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా 177 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. దక్షిణాఫ్రికా విసిరిన 539 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో ఆస్ట్రేలియా విఫలమై ఓటమి పాలైంది. ఉస్మాన్ ఖవాజా(97), నేవిల్(60 నాటౌట్)రాణించినా జట్టును ఓటమి నుంచి తప్పించలేకపోయారు.

Loading...

Leave a Reply

*