ట్రాఫిక్‌లో ఎక్కువ‌గా తిరుగుతున్నారా.. మీరు సంసారానికి ప‌నికిరార‌ట‌..!

sex-life

కాలుష్యం కోర‌ల్లో చిక్కుకొని విల‌విల్లాడుతున్నారా..? నిత్యం ట్రాఫిక్‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్నారా..? ఇలా ఎక్కువ కాలం చేస్తే మీరు సంసార సుఖానికి దూర‌మ‌య్యే చాన్స్ ఉందంటున్నారు సెక్సాలజిస్టులు. తాజా ప‌రిశోధ‌న‌ల‌లో అదే బ‌య‌ట‌ప‌డింద‌ట‌. దేశ రాజ‌ధాని సాక్షిగా జ‌రిగిన సర్వేలో ఈ చేదు వాస్త‌వాన్ని సంతానోత్ప‌త్తి నిపుణులు బ‌య‌ట‌పెట్టారు. ఢిల్లీలో సాధార‌ణంగానే ట్రాఫిక్ ఎక్కువ‌. దానికి దీపావ‌ళి కూడా క‌లిసి వ‌చ్చింది. ఈ బంప‌ర్ ఆఫ‌ర్‌తో అక్క‌డ కాలుష్యం స్థాయి ఓ రేంజ్‌లో పెరిగింద‌ట‌. ఇలా కాలుష్యం పెర‌గ‌డం ప్ర‌జ‌ల సెక్స్ జీవితాల‌ను తీవ్రంగా ప్ర‌భావితం చేస్తుంద‌ని వైద్యులు తేల్చి చెబుతున్నారు.

వాయు కాలుష్యం కారణంగా వస్తున్న అనారోగ్యాలతో సెక్స్ కార్యకలాపాలు 30 శాతం తగ్గిపోతున్నాయని వైద్యులు చెప్పారు. దీపావళి తర్వాత దేశ రాజధాని నగరంలో గత 17 ఏళ్లలో ఎన్నడూ లేనంత వాయు కాలుష్యం అలముకుంది. గాలిలోని కలుషిత లోహాలు స్త్రీ, పురుషుల హార్మోన్లపై ప్రభావితం చూపిస్తాయని వెల్లడైంది. దేశంలో స్త్రీల కంటే పురుషుల్లో 15 శాతం మంది వంధత్వం సమస్యతో బాధపడుతున్నారని అధ్యయనంలో వెల్లడైంది. గాలిలో ఏర్పడిన నలుసు పదార్ధం, హైడ్రో కార్బన్లు, కాడ్మియం స్త్రీ,పురుషుల హార్మోన్ల సమతౌల్యాన్ని దెబ్బతీయడమే కాకుండా వీర్యాన్ని విషపూరితం చేస్తాయని వైద్యులు అంటున్నారు.

టెస్టోస్టెరాన్ లేదా ఈస్ట్రోజెన్ స్థాయి తగ్గిపోవడం వల్ల సెక్స్ కోరిక తగ్గుతుందని వైద్యనిపుణులు చెబుతున్నారు. సంతానోత్పత్తి సమస్య ఏర్పడకుండా ఉండాలంటే ఆరుబయటకు వెళ్లేటపుడు కాలుష్యం బారిన పడకుండా బహుళ వడపోత ముసుగులు ఉపయోగించాలని వైద్యులు సూచిస్తున్నారు. కాలుష్య గాలిని పీల్చడం వల్ల పురుషుల వీర్యంలో నాణ్యత దెబ్బతింటుందని వైద్యులు అంటున్నారు. ఢిల్లీలో కాలుష్యం స్థాయి పెరగడం వల్ల పురుషుల్లో వంధ్యత్వానికి కారణం అవుతుంది. దీంతోపాటు స్త్రీలలో గర్భస్రావం అవకాశాలు పెరిగాయని వైద్యనిపుణులు పేర్కొన్నారు. వాయు కాలుష్యం గర్భంపై ప్రతికూల ప్రభావం చూపిస్తుందని గైనకాలజిస్టులు వివరించారు.

Loading...

Leave a Reply

*