ద‌స‌రా, దీపావ‌ళికి బెజ‌వాడ‌, గుంటూరు యూత్ ఆన్‌లైన్‌లో ఎంతకి కొన్నారో తెలుసా..?

on

ఎక్క‌డ చూసినా.. ఆన్ లైన్ మార్కెట్‌దే హ‌వా.. అన‌కాప‌ల్లి టు అమెరికా.. ఈ కామ‌ర్స్ మార్కెట్‌దే హంగామా అంతా. సెల్‌ఫోన్ నుంచే మ‌న‌కు కావాల్సిన వ‌స్తువులు, దుస్తులు, గృహోప‌క‌ర‌ణాలు… ఇలా ఏది కావాల‌న్నా సింగిల్ క్లిక్‌తో కొనేయొచ్చు. అంత‌టి సౌల‌భ్యం ఉంది ఈ కామ‌ర్స్ మార్కెట్‌కి. ఎన్నో వంద‌లు కాదు.. కాదు.. వేల ర‌కాల ఐటెమ్స్, బ్రాండెడ్‌దుస్తులు.. చిటికెలో షాపింగ్ చేసేయొచ్చు. న‌చ్చ‌లేదంటే వాప‌స్ ఇచ్చేయొచ్చు. ఇదే అంద‌రినీ ఊరిస్తోంది.సంప్ర‌దాయ షాపింగ్ నుంచి ఆధునిక పోక‌డ‌ల‌ను సంతరించుకుంటోంది. ఇది ప‌ట్ట‌ణాల‌కే కాదు.. మారుమూల ప‌ల్లెల‌కు కూడా విస్త‌రిస్తోంది.

అయితే, తెలుగు రాష్ట్రాల‌లో ఇప్ప‌టిదాకా ఈ కామ‌ర్స్ మార్కెట్ అంటే ఎక్కువ‌గా హైద‌రాబాద్ కేంద్రంగానే జ‌రుగుతోంది అని భావించిన వారి భ్ర‌మ‌ల‌ను బ‌ద్దలు కొడుతున్నాయి ఇటీవ‌లి ట్రెండ్స్‌. ఏపీ రాజ‌ధాని ప్రాంతంగా గుర్తింపు తెచ్చుకున్న బెజ‌వాడ‌, గుంటూరు ఏరియాలోనూ ఆన్‌లైన్ షాపింగ్‌కి భారీ డిమాండ్ ఏర్ప‌డింది.ఈ ద‌స‌రా,దీపావ‌ళి సీజ‌న్‌లో హైద‌రాబాద్‌తో పోటీ ప‌డేలా అక్క‌డి జ‌నాలు కూడా ఆన్ లైన్ మార్కెట్‌ని షేక్ చేశాయి. ఎంత‌లా అంటే, ఆరెండు ప‌ట్ట‌ణాల నుంచే ఏకంగా 6 వంద‌ల కోట్ల రూపాయ‌ల బిజినెస్ జ‌రిగింద‌ట‌. ఇది ఊహించ‌ని ట్రెండ్ అని చెబుతున్నారు మార్కెట్ విశ్లేష‌కులు.

గ‌తంతో పోల్చుకుంటే.. ఇది దాదాపు మూడు రెట్ల‌ట‌. జ‌నాల‌లో పెరిగిన అవ‌గాహ‌న‌, మొబైల్ మార్కెట్ విస్త‌ర‌ణ‌కి తోడు.. ఆన్‌లైన్ షాపింగ్ ఇక త్వ‌ర‌లోనే మారుమూల ప‌ల్లెల‌కు కూడా విస్తరిస్తుంది అని చెప్ప‌డానికి ఇది ఉదాహ‌ర‌ణ అని చెబుతున్నారు.ఇప్పుడే ఇలా ఉంటే.. సంక్రాంతి కోస్తాకి బిగ్ సీజ‌న్‌. మ‌రి, ఆ టైమ్‌లో ఆఫ‌ర్‌లు పెడితే.. మ‌రోసారి అదే రేంజ్‌లో బిజినెస్ జ‌ర‌గ‌డం గ్యారంటీ అట‌. ఇక‌పై ఆన్ లైన్ మార్కెట్ సంస్థ‌లు.. అక్క‌డి బిజినెస్‌పైనా స్పెష‌ల్ ఫోక‌స్ పెట్ట‌డం గ్యారంటీ అన్న‌మాట‌.

Loading...

Leave a Reply

*