జియో గుట్టు బ‌య‌ట‌ప‌డింది.. అంతా బ్లాక్‌మ‌నీయే.. వైట్‌గా మార్చ‌డానికే ఫ్రీ ఆఫ‌ర్‌…!

untitled-10

నోట్ల నిషేధంతో క‌ట్టల కోద్దీ నోట్లు దాచుకున్న వాళ్లంతా ఇప్పుడు బెంబేలు ప‌డుతున్నారు. అయితే, కొంత‌మంది మాత్రం ముందే మేలుకుని న‌ల్ల‌ధ‌నాన్ని స‌ద్వినియోగం చేసుకునే ప‌నిలో ప‌డ్డార‌ని తాజాగా బ‌య‌ట‌కొస్తున్న క‌థ‌నాలు. వీరిలో ముఖేశ్ అంబానీ ముందు వ‌రుస‌లో ఉన్నారు. నోట్ల నిషేధం సంగ‌తి లీకైందో… లేక ఎప్ప‌టికైనా మోడీ ఉన్నంత కాలం న‌ల్ల‌ధ‌నానికి ఇబ్బందే అని గ్ర‌హించారో తెలియ‌దు కానీ ముకేశ్ అంబానీ కొన్ని నెల‌ల క్రిత‌మే త‌న వ‌ద్ద ఉన్న బ్లాక్ మ‌నీని ఖ‌ర్చు పెట్టే ప‌ని మొద‌లెట్టార‌ట‌.

ఇందులో భాగంగా జీయో అనే సంచ‌ల‌నాత్మ‌క ప‌థ‌కాన్ని ప్ర‌క‌టించి జ‌నం మీద‌కు వ‌దిలార‌ట‌. జీయో ద్వారా అత్యంత ఖ‌రీదైన 4జీ సేవ‌ల‌ను ఉచితంగా అందించే భారీ ఆఫ‌ర్‌ను ప్ర‌క‌టించారు. ఈ ఆఫ‌ర్‌తో దిగ్గ‌జ టెలికం కంపెనీల కూసాలు క‌దిలిపోయిన సంగ‌తి తెలిసిందే. జియో ద్వారా ఉచిత సేవ‌ల‌ను అందిస్తూ… త‌న వ‌ద్ద ఉన్న బ్లాక్ మ‌నీనీ జ‌నానికి పంచే కార్య‌క్ర‌మాన్ని మొద‌లెపెట్టార‌న్న‌మాట‌. ఇలా అత్యంత ఖ‌రీదైన‌ 4జీ సేవ‌ల‌ను ఫ్రీగా అందించి వేల కోట్ల రూపాయ‌లను ఖ‌ర్చు చేసేశారు. త‌న భోషాణంలోని న‌ల్ల ధ‌నాన్ని కొంత మేర ఖాళీ చేసుకున్నారు. ఇక‌, జ‌నం కూడా ఉచిత 4జీ సేవ‌ల‌ను అందుకుంటూ అంబానీ వారి బ్లాక్ డ‌బ్బును అనుభ‌వించారు. ఇప్పుడు అక్క‌డ‌క్క‌డ కోట్ల క‌ట్ట‌లు పారేస్తున్నట్లే… అంబానీ అప్ప‌ట్లోనే జీయో ద్వారా జ‌నానికి త‌న బ్లాక్ మ‌నీని పంచేశార‌న్న‌మాట‌.

Loading...

Leave a Reply

*