షాకింగ్‌… మార్కెట్‌లోకి అప్పుడే డూప్లికేట్ 2000 నోట్లు…!

2000note

కొత్త 2000 నోటు మార్కెట్‌లోకి వ‌చ్చి 100 గంట‌లు కూడా కాలేదు. అప్పుడే దానికి ఫేక్ నోటు పుట్టుకొచ్చిందంటూ వ‌స్తున్న పుకార్లు భార‌త ప్ర‌భుత్వాన్ని షేక్ చేస్తున్నాయి. మార్కెట్‌లో నిన్న‌మొన్న‌టిదాకా ఉన్న క‌రెన్సీని ప్రింట్ చెయ్య‌డం, దానికి ఫేక్ క‌రెన్సీ చెయ్య‌డం ఈజీగా ఉండ‌డంతో మోదీ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. డూప్లికేట్ గాళ్ల‌కు షాక్ ఇస్తూ కాపీ కొట్ట‌డానికి వీలు లేని విధంగా కొత్త నోటును ముద్రించారు. అదే ఇప్పుడ మార్కెట్లో స‌ర్య్కులేట్ అవుతోంది. కానీ, దీనిపై అప్పుడే ఫేక్ క‌రెన్సీ పుట్టుకొచ్చింద‌నే వార్తలు షాకింగ్‌గా మారాయి. సోష‌ల్ మీడియాలో జ‌రుగుతున్న ప్ర‌చారం జ‌నాల‌కు విస్మ‌యానికి గురి చేస్తున్నాయి.

అయితే, కొత్త నోటుని ఎంతో ప‌క‌డ్బందీగా, ప‌క్కా స్కెచ్‌తో కాపీ కొట్ట‌డానికి కష్ట‌మ‌య్యేలా దీనిని రూపొందించింద‌ట భార‌త స‌ర్కార్‌. అవ‌న్నీ పుకార్లేనని అధికారులు కొట్టిపారేస్తున్నారు. కొత్త నోటుకి ఉన్న ఫీచ‌ర్స్‌ని మ‌రోసారి గుర్తు చేస్తున్నారు. కొత్త నోటులో కుడివైపున 2000 అంకె దేవ‌నాగ‌రి లిపిలో ఉంటుంది. మ‌హాత్మాగాంధీ బొమ్మ గ‌తంలో కాకుండా.. నోటు మ‌ధ్య‌లో ఉంటుంది. ఇక‌, నోటుకింద భాగంలో కూడా 2000 అంకె ఉంటుంది. అయితే, 45 డిగ్రీలు వంచి చూస్తేనే ఇది కనిపిస్తుంది.

2000 నోటుపై కొన్ని చిన్న అక్ష‌రాలు కూడా ఉన్నాయి. ఆర్‌బీఐ అని ఇంగ్లీష్ లెట‌ర్స్‌తో పాటు 2000 అని నోటుకి ఎడ‌మ‌వైపున ఉంటాయి. భార‌త్ అని సెక్యూరిటీ థ్రెడ్ కింద ఉంటుంది. ఆర్‌బీఐ, 2000 లెట‌ర్స్‌.. గులాబీ రంగులో ద‌ర్శ‌న‌మిస్తున్నాయి. గ‌తంలో నోటుపై ముద్రించే థ్రెడ్ ఆకుప‌చ్చ రంగులో ఉండేది. ప్ర‌స్తుతం అది నీలిరంగులోకి మార్చారు. గ్యారెంటీ క్లాజ్‌, ఆర్‌బీఐ గ‌వ‌ర్న‌ర్ సంత‌కం వంటివి నోటుకి కుడివైపున ఉండేలా డిజైన్ చేశారు.

మ‌హాత్మాగాంధీ బొమ్మ‌కు కుడివైపున అశోక స్తూపం ఉంది. 2000 అంకె ఎల‌క్ర్టోటైప్ వాట‌ర్ మార్క్ ఎడ‌మ‌వైపు నుంచి కుడివైపుకు ఉంటుంది. నెంబ‌ర్ ప్యానెల్ సంఖ్య‌లో ఎడ‌మ‌వైపు నుంచి కుడికి పెరుగుతూ ఉంటుంది. ఇలా సైజ్ పెర‌గ‌డం ఈ కొత్త నోటు స్పెషాలిటీ. పాత నోట్ల‌లో అన్నీ అంకెలు ఒకేలా ఉంటాయి.

ఇక నోటుకి ఎడ‌మ‌వైపున నోటు ముద్రించిన సంవ‌త్స‌రం ఉంటుంది. స్వ‌చ్చ‌భార‌త్ లోగో, నినాదం ఉంటాయి. ఇక పాత 500, 1000 రూపాయ‌ల నోట్ల‌లో వివిధ లాంగ్వేజెస్ స్థానం ఎడ‌మ‌వైపు క‌నిపించేది. దీని స్థానంలో కొత్త నోటులో మంగ‌ళ‌యాన్ క‌నిపిస్తుంది. ఇక చూపులేని వారికోసం కూడా కొన్ని స్పెష‌ల్ ఫీచ‌ర్స్ ఉన్నాయి. మ‌హాత్మాగాంధీ బొమ్మ‌, అశోక‌చ‌క్రం కాస్త ఒత్తుగా ఉండ‌నున్నాయి. బ్లీడింగ్ లైన్‌లు, ఐడెండిటీ మార్క్ వంటివి కూడా చేతితో తాకితే సైతం ఒక అనుభూతి వ‌చ్చేలా చేశారు. ఇక‌, కోణీయ రేఖ‌లు కుడి, ఎడ‌మ‌వైపు ఉంటాయి. వీటితో పాటు పాత నోట్ల‌లో క‌నిపించ‌ని కొన్ని కొత్త ఫీచర్స్‌ను కూడా యాడ్ చేశారు. కొత్త నోటుతో ఇక ఫేక్ నోట్లు మార్కెట్‌లోకి రాకుండా చాలా జాగ్ర‌త్త‌లు తీసుకున్నారు. అందుకే ఎలాంటి భ‌యం లేదంటున్నారు.

Loading...

Leave a Reply

*