ఎస్‌బీఐ ఖాతాదారుల‌కు షాకింగ్ న్యూస్‌!

state-bank-of-india

అతి పెద్ద దేశీయ బ్యాంకు ఎస్‌బీఐ తమ ఖాతాదారుల‌ 6.25 లక్షల డెబిట్‌ కార్డులను బ్లాక్‌ చేసింది. థ‌ర్డ్ పార్టీ ఏటీఎంల‌లో అనుమానాస్పద లావాదేవీలు జరగడంతో ఈ తీవ్ర‌మైన నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. ఇంత పెద్ద సంఖ్య‌లో కార్డులు బ్లాక్ చేసిన సంగ‌తి స‌ద‌రు ఖాతాదారుల‌కు తెలియ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఈ నేప‌థ్యంలో ఆ ఖాతాదారులంతా త‌మ కార్డులు ప‌ని చేయ‌క‌పోవ‌డంతో బెంబేలెత్తిపోతున్నారు. కార్డులు ఏటీఎంలో పెట్టినా అవి ప‌ని చేయ‌క‌పోవ‌డంతో ఆందోల‌న‌కు గుర‌వుతున్నారు. అయితే, ఖాతాదారుల‌కు ఎస్సెమ్మెస్ స‌మాచారం ఇచ్చామ‌ని, కార్డు బ్లాక్‌ అయిన వారు బ్యాంకు బ్రాంచ్‌కి వెళ్లి కొత్త కార్డు కోసం అప్టై చేసుకోవాలని అధికారులు తెలిపారు. ఎస్‌బీఐ దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో నాలుగు రోజుల నుంచి పలు అనుమానాస్పద లావాదేవీలను గుర్తించి ఈ కార్డులను బ్లాక్‌ చేసింది. కేవలం ఎస్‌బీఐ కార్డులు మాత్రమే కాకుండా ఇతర ప్రయివేటు, విదేశీ బ్యాంకు కార్డులు కూడా ప్రమాదంలో ఉండొచ్చని ఎస్‌బీఐ బ్యాంకు అధికారులు చెబుతున్నారు.

నెల రోజుల కిందట ఖాతాదారులకు సంబంధించిన సమాచారం హ్యాక్‌ అయి ఉంటుందని తమ పరిశీలనలో తేలిందని.. అందువల్లే తాము అనుమానాస్పద కార్డులన్నింటినీ బ్లాక్‌ చేస్తున్నామని వివరించారు. ఈ కార్డులన్నీ మ్యాగ్నటిక్‌ బేస్డ్‌ అని తెలిపారు. అందరూ వెంటనే తమ కార్డుల పిన్‌ నంబర్లను మార్చుకోవాల‌ని అధికారులు విజ్ఞ‌ప్తి చేస్తున్నారు. ఏటీఎం మిష‌న్ల వ‌ద్ద మోసాల‌కు పాల్ప‌డుతున్న కొంద‌రు అక్క‌డి నుంచే డెబిట్ కార్డుల స‌మాచారం త‌స్క‌రించి డ‌బ్బులు కొట్టేస్తున్న‌ట్లు బ్యాంకు అధికారులు చెబుతున్నారు. దానికి చెక్ పెట్ట‌డానికే తాము పెద్ద సంఖ్య‌లో కార్డులు బ్లాక్ చేసిన‌ట్లు వెల్ల‌డించారు.

Loading...

Leave a Reply

*