టెండూల్క‌ర్ రెండో కొడుకు చిన్న‌ప్పుడు త‌ప్పిపోయాడా?

sachin

స‌చిన్‌కి ఇద్ద‌రు కొడుకులు ఉండేవాళ్లా?.. వాళ్లు ఇద్ద‌రు క‌వ‌ల పిల్ల‌ల్లా?.. చిన్న‌ప్పుడు ఒక‌డు త‌ప్పిపోయి కెన‌డా వెళ్లిపోయాడా?? అక్క‌డ జ‌స్టిన్ బీబ‌ర్ అనే పేరుతో పాప్ సింగ‌ర్‌గా ఫేమ‌స్ అవుతున్నాడా??…. తాజాగా కొన్ని ఫొటోలు చూసిన నెటిజ‌న్లు ఇదే నిజమే అంటున్నారు… నిజ‌మ‌ని బ‌లంగా న‌మ్ముతున్నారు… స‌చిన్‌తో క‌లిసి ఉన్న కుర్రాడ్ని చూసి భార‌తీయులే కాదు… అమెరికాలోని ఎన్నారైలు కూడా స్ట‌న్ అయిపోయారు.. వీడు వెస్ట్ర‌న్ వాల్డ్‌లో మ‌రీ ముఖ్యంగా అమెరికాలో తాజా పాప్ సెన్సేష‌న్ జ‌స్టిన్ బీబ‌ర్ క‌దా… వీడేంటి స‌చిన్‌ను వెన‌క‌నుంచి గ‌ట్టిగా ప‌ట్టుకున్నాడు.. డాడీ అంటున్నాడు అని జ‌నం బేజారెత్తిపోతున్నారు… అయితే ఈ ఫొటోలో క‌నిపిస్తోంది స‌చిన్ టెండూల్క‌ర్ కొడుకు అర్జున్ టెండూల్క‌రే… అయితే అత‌డికి జ‌స్టిన్ బీబ‌ర్‌తో ద‌గ్గ‌ర పోలిక‌లు ఉన్నాయి…

క్రికెట్ లెజెండ్ స‌చిన్ టెండూల్క‌ర్ కొడుకు అర్జున్ ఈమ‌ధ్య‌నే 17వ బ‌ర్త్‌డే జ‌రుపుకున్నాడు… సెప్టెంబ‌ర్ 24న ముంబైలోని త‌మ ఇంట్లో పుట్టిన రోజు వేడుక‌లు ఘ‌నంగా జ‌రుపుకున్నాడు…. ఆ సంద‌ర్భంగా స‌చిన్‌తో అర్జున్ దిగిన ఫొటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది… తండ్రి బాట‌లోనే క్రికెట్‌లో ఎదుగుతున్న అర్జున్ ఫొటోను చూసి నెటిజ‌న్లు కెవ్వుమంటూ కేక పెట్టారుట‌… ఆ ఫొటో చూసి చాలామంది బిత్త‌ర‌పోయారుట… కొంత‌మంది అయితే అత‌డ్ని కెన‌డియ‌న్ పాప్ సెన్సేష‌న్ జ‌స్టిన్ బీబ‌ర్ అనుకుని పొర‌ప‌డ్డారు… చాలామంది అర్జున్ ఫొటో చూసి బీబ‌ర్ అనుకున్నారంటే వాళ్లిద్ద‌రికి ఎన్ని పోలిక‌లు ఉన్నాయో అర్థం చేసుకోవ‌చ్చు…

ఇంకొంత‌మంది నెటిజ‌న్ల‌యితే బీబ‌ర్‌, అర్జున్ చిన్న‌ప్పుడు త‌ప్పిపోయిన సోద‌రుల‌ని, తెలుగు సినిమాల్లో లాగా వాళ్లిద్ద‌రు మ‌ళ్లీ కలుసుకుంటారంటూ జోకులు వేశారు… ఇంకొంద‌ర‌యితే బీబ‌ర్‌, అర్జున్ ఫొటోలు ప‌క్క‌ప‌క్క‌నే పెట్టి సురేష్‌, ర‌మేష్ అంటూ ఫ‌న్నీ కామెంట్లు చేశారు.. ప్ర‌స్తుతం సోషల్ మీడియాలో వైర‌ల్‌గా మారిన ఈ ఫొటోలు కెవ్వు కేక పుట్టిస్తున్నాయి… వీటికి లైకులు కేక పెడుతున్నాయి.

Loading...

Leave a Reply

*