సెక్స్‌లో రోబోయే బెస్ట్‌!

robo

మ‌నిషికీ మ‌నిషికీ దూరం పెరిగిపోయింది. ఇప్పుడు మ‌నిషి అవ‌స‌రానికి కూడా సాటి మ‌నిషి అవ‌స‌రం లేకుండా పోయే రోజులొచ్చాయి. మిగిలిన అన్ని విష‌యాల్లో ఒకే. కానీ వ్య‌క్తిగ‌త సుఖాల విష‌యంలోనూ ఇప్పుడు మ‌నిషి అవ‌స‌రం లేకుండా పోయే ప‌రిస్థితి వ‌స్తుంది. ప్ర‌కృతిస‌హ‌జంగా జ‌ర‌గాల్సిన, అనుభ‌వించాల్సిన వాటి విష‌యంలో కూడా ఇప్పుడు యంత్రాలు ముందుకొస్తున్నాయి. రానున్న మూడు ద‌శాబ్దాల్లో స్ర్తీ, పురుషుల బెడ్‌రూంల్లోకి కూడా యంత్రాలు రాబోతున్నాయి. అవే సెక్స్ రోబోలు. సాటి వ్య‌క్తితో కంటే రోబోతో సెక్సే బెస్ట్ అన్నంత‌గా మ‌నుషులు మారిపోయే రోజు ముంచుకొస్తుంద‌ని శాస్త్ర‌వేత్త‌లు చెబుతున్నారు.

రోబో సినిమాలో ఐశ్వ‌ర్య‌రాయ్‌ని ప్రేమించే చిట్టిలు ఓ ముప్పై ఏళ్ల త‌ర్వాత అంద‌రికీ అందుబాటులోకి వ‌స్తాయ‌న్న‌ది వారి క‌థ‌నం. పైగా మ‌నుషుల‌తో ప‌డ‌క సుఖానికంటే రోబోల‌తో ఆ సుఖాన్ని పొంద‌డానికే స్ర్ర్తీ, పురుషులు ఎక్క‌వ‌గా ఆస‌క్తి చూపిస్తార‌న్న‌ది వారి అంచనా. అంతేకాదు. రోబోల‌తో సుఖాన్ని పొంద‌డానికే అంద‌రూ ఎక్కువ ఆస‌క్తి చూపిస్తార‌ట‌. ఒక‌రకంగా సెక్స్ రోబోల‌కు ఎడిక్ట్ అయిపోతార‌ట‌. అత్యుత్తమమైన ప్రోగ్రామింగ్‌ ద్వారా అంద‌రి అభిరుచులకు అనుగుణంగా ఈ సెక్స్‌ రోబోలను మార్కెట్‌లోకి వ‌స్తాయ‌ట‌. ఈ రోబోలు హ్యుమ‌న్ పార్ట‌న‌ర్స్ కంటే బెస్ట్ లవర్స్‌గా ఉంటాయ‌న్న‌ది రోబో నిపుణుల వాద‌న‌.

వాటిలో ఉంచే ప్రొగ్రామింగ్ ద్వారా తమ పార్ట‌న‌ర్‌కు అవ‌స‌ర‌మైన సుఖాన్ని కావాల్సినంత అనుభ‌వాన్ని అందించ‌గ‌ల‌వ‌ని వారు చెబుతున్నారు. బెడ్‌రూంలో సెక్స్ స‌మ‌యంలో హ్యుమ‌న్ పార్ట‌న‌ర్స్ కంటే ఇవి ఎంతో సంతృప్తి ప‌రిచేలా ఉంటాయ‌ని దాంతో అంద‌రూ వాటికి బానిస‌లైపోయే ప‌రిస్థితి వ‌స్తుంద‌న్న‌ది వారి మాట‌. అయితే, మాన‌సిక శాస్త్ర‌వేత్త‌లు, సెక్స్ స్పెష‌లిస్టులు మాత్రం మాన‌వుల మ‌ధ్య ఉండే లైంగిక సంబంధాలు యంత్రాల‌తో ఫుల్‌ఫిల్ చేయ‌డం సాధ్య‌మ‌య్యే ప‌నే కాద‌ని రోబోటిక్ శాస్త్ర‌వేత్త‌ల వాద‌న‌ను తోసిపుచ్చుతున్నారు.

Loading...

Leave a Reply

*