నోట్ల ర‌ద్దు ఎఫెక్ట్.. స్మార్ట్ ఫోన్‌లు ఫ్రీ ఫ్రీ..!

smart-phones

పెద్ద నోట్ల ర‌ద్దు ప్ర‌భావం ప‌డ‌ని రంగం లేదు. ఉప్పు ప‌ప్పు నుంచి ఎయిర్ బ‌స్ టికెట్‌ల వ‌ర‌కూ.. అందులేద‌ని సందేహం లేదు ఎందెందు వెదికినా క‌నిపిస్తోంది. తాజాగా మొబైల్ ఫోన్ రిట‌యిల‌ర్‌ల‌కు కూడా చుక్క‌లు చూపిస్తోంది ఇది. దీపావ‌ళి, సంక్రాంతి సీజ‌న్ వ‌చ్చిందంటే చాలు.. మొబైల్ ఫోన్ వ్యాపారం క‌ళ‌క‌ళలాడుతోంది. ప్రస్తుతం సీన్ రివ‌ర్స్‌. ఆన్‌లైన్‌లో స్మార్ట్ ఫోన్ కొన‌డానికి కార్డ్‌లతో మేనేజ్ చేసినా.. ఆఫ్ లైన్‌లో అంటే మొబైల్ స్టోర్స్‌లో కొనాలంటే మాత్రం న‌ర‌కమే. చేతిలో ఉన్న క్యాష్ చెల్ల‌ని ప‌రిస్థితి. దీంతో, సేల్స్ ప‌డిపోయిన కంపెనీలు కొత్త ఆఫర్‌ల‌కు తెరదీస్తున్నాయి. ఫ్రీ ఆఫ‌ర్‌ని తెర‌పైకి తెస్తున్నాయి.

ఉచితం అంటే మొబైల్ ఫోన్ అనుకునేరు. అలాంటిదేమీ కాదు. కేవ‌లం జీరో ప‌ర్సెంట్ ఇంట‌రెస్ట్‌కి తెర‌దీస్తున్నాయి రిట‌యిల్ మొబైల్ స్టోర్‌లు. నాలుగు రోజుల‌కే షాప్‌ల‌లో ఒక్క క‌స్ట‌మ‌ర్ క‌నిపిస్తే ఒట్టు అన్న ప‌రిస్థితి క‌నిపించ‌డంతో వెంట‌నే కస్ట‌మ‌ర్‌ల‌ను ఆహ్వానించే ప‌నిలో ప‌డ్డాయి రిట‌యిల్ స్టోర్‌లు. ముందుగా ఆ ఆఫ‌ర్‌ని ప్ర‌క‌టించింది సంగీత మొబైల్ స్టోర్‌. దీనికి ఒక్క ద‌క్షిణాదిలోనే దాదాపు 300 స్టోర్‌లు ఉన్నాయి. అంటే, ఉద్యోగుల జీత‌భ‌త్యాలు, షాప్‌ల రెంట్‌లు కూడా ఈ నెల‌లో గ‌గ‌న‌మ‌య్యే ప‌రిస్థితి. అందుకే, వినియోగ‌దారుడు ముందుగా కావాల్సిన స్మార్ట్ ఫోన్‌ని తీసుకుపోవచ్చు. ఆ త‌ర్వాత వాయిదా ప‌ద్ద‌తుల్లో జీరో ప‌ర్సంటేజ్ వ‌డ్డీతో చెల్లించ‌వ‌చ్చు అనే ఆఫ‌ర్‌ని ప్ర‌క‌టించింది. ఈ ఆఫర్‌తో సేల్స్ మ‌ళ్లీ ఊపందుకున్నాయ‌ని, త్వ‌ర‌లోనే త‌మ ఖ‌ర్చుల‌కు స‌రిపోను రావొచ్చ‌ని అంచ‌నా వేస్తున్నామ‌ని చెబుతోంది ఈ కంపెనీ. టోట‌ల్‌గా ఫ్రీ ఆఫ‌ర్ అంటే రానిది ఎవ‌రు చెప్పండి..!

Loading...

Leave a Reply

*