జియో క‌స్ట‌మ‌ర్ల‌కు మ‌రో షాకింగ్ ఆఫ‌ర్‌.. మీరు రెడీనా..?

jio

డేటాగిరి అంటూ అంబానీ క్రియేట్ చేసిన సంచ‌ల‌నం అంతా ఇంతా కాదు. జియోతో ఆయ‌న టెలికాం మార్కెట్‌లో ప్ర‌కంప‌న‌లు క్రియేట్ చేశాడు. దీంతో, ఇత‌ర టెలికాం కంపెనీల‌న్నీ జియో బాట ప‌ట్టాయి. ఆఫ‌ర్‌ల మీద ఆఫ‌ర్‌లు ఇచ్చాయి. అయితే, తాజాగా మ‌రో బ్లాస్టింగ్ ఆఫ‌ర్‌కి జియో సిద్ధ‌మ‌యిన‌ట్లు మార్కెట్ వ‌ర్గాల‌లో ప్రచారం జ‌రుగుతోంది.

జియో ఎంట్రీతో ఇత‌ర కంపెనీలు కూడా ఆఫ‌ర్‌లు ఇచ్చాయి. దీంతో, త‌న‌వైపుకు వ‌స్తార‌న‌కున్న క‌స్ట‌మ‌ర్‌ల నెంబ‌ర్ అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్లుగా లేద‌ట‌. దీంతో మ‌రో బంప‌ర్ ఆఫ‌ర్‌కి రెడీ అవుతున్న‌ట్లు స‌మాచారం. ప్ర‌త్య‌ర్థి కంపెనీల‌ను మరింత దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా డిసెంబరు 3తో ముగియనున్న ఉచిత వాయిస్ కాల్ ఆఫర్‌ను మరో మూడు నెలల పాటు అంటే మార్చి 2017 వరకు పొడిగించేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. తద్వారా పదికోట్ల మంది వినియోగదారులను చేరుకోవాలని భావిస్తోంది. నిజానికి టెలికమ్యూనికేషన్ టారిఫ్ ఆర్డర్ ప్రకారం ప్రమోషనల్ ఆఫర్ 90 రోజులకు మించి ఉండడానికి వీల్లేదు. కాబట్టి జియో మరో మూడు నెలల పాటు ఆఫర్‌ను ఎలా పొడిగిస్తుందనే దానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

అయితే డిసెంబరు తర్వాత ఉచిత సేవలు కొనసాగించేందుకు ట్రాయ్ అనుమతితో పనిలేదని జియో వ‌ర్గాలు చెబుతున్నాయి. లాంచింగ్ సమయంలో వినియోగదారులకు ఇచ్చిన హామీ మేరకు సేవలను అందించలేకపోతే, వారి నుంచి చార్జీలు వసూలు చేయడం కూడా న్యాయవిరుద్ధమన్న కోణంలో ఉచిత సేవలను పొడిగించేందుకు జియో సిద్ధమవుతోంది. ఇంటర్ కనెక్షన్ సమస్యల వల్ల వినియోగదారులు నాణ్యమైన సేవలు అందుకోలేకపోతున్నారని జియో అధికారులు చెబుతున్నారు. కాబట్టి ఉచిత ఆఫర్ పొడిగింపునకు ట్రాయ్ అనుమతి అవసరం లేదని వారు చెబుతున్నారు.

Loading...

Leave a Reply

*