డీటీహెచ్‌లో రిల‌య‌న్స్ సంచ‌ల‌నం

reliance

జియోతో ప్ర‌త్య‌ర్థి టెలికం కంపెనీల‌కు వ‌ణుకు పుట్టించిన‌ రిల‌య‌న్స్ ఇప్ర‌డు మ‌రో సంచ‌ల‌నానికి సిద్ధ‌మ‌వుతున్న‌ట్లు తెలుస్తోంది. ఈసారి త‌న గురి డీటీహెచ్‌ల‌పై పెట్టిన‌ట్లు తాజా క‌బురు. డీటీహెచ్ రంగంలోకి అడుగు పెట్టాల‌ని రిలయన్స్ జియో నిర్ణ‌యించిన‌ట్లు స‌మాచారం. భారీ ఆక‌ర్ష‌ణీయ‌మైన ప్యాకేజీల‌తో వినియోగ‌దారుల‌ను హృద‌యాల‌ను కొల్ల‌గొట్టి… డీటీహెచ్ కంపెనీలను కోలుకోలేని దెబ్బ కొట్టాల‌ని భారీ వ్యూహాన్ని ర‌చించింద‌ట‌. ఇప్ప‌టి వ‌ర‌కూ దేశంలో ఏ డీటీహెచ్ కంపెనీ ప్ర‌క‌టించ‌ని మైండ్ బ్లోయింగ్ ఆఫ‌ర్‌ను ప్ర‌క‌టించాల‌ని రిల‌య‌న్స్ జియో నిర్ణ‌యించింద‌ట‌. ప్ర‌స్తుతం ఇతర కంపెనీలు 275 నుంచి 300 రూపాయలకు నెలవారీ డీటీహెచ్ ప్యాక్‌ల‌ను అందిస్తున్నాయి.

ఈ ప్యాక్‌ల‌ను కేవ‌లం రూ.185ల‌కే అందించాల‌ని ముఖేశ్ అంబానీ త‌ల‌పోస్తున్నార‌ని స‌మాచారం. ఈ చ‌ర్య ద్వారా డీటీహెచ్ రంగంలోనూ పాతుకుపోయిన ఎయిర్‌టెల్‌కు భారీ న‌ష్టాన్ని మిగులుస్తుంద‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు. ఇదే నిజ‌మైతే.. డీటీహెచ్ రంగంలోనూ జీయో హ‌వానే న‌డుస్తుంద‌ని మిగిలిన కంపెనీలు త‌ట్టాబుట్టా స‌ర్దుకోవాల్సి వ‌స్తుందన్న‌ది వారి వాద‌న‌. ఎయిర్‌టెల్, టాటా స్కై, డిష్ టీవీ కంపెనీలు జీయో దెబ్బ‌కు తిరిగి కోలుకోవ‌డం క‌ష్ట‌మేన‌న్న‌ది వారి సూత్రీక‌ర‌ణ‌. రిలయన్స్ జియో డీటీహెచ్ ఆఫ‌ర్ల ప్ర‌క‌ట‌న అతి త్వ‌ర‌లోనే విడుద‌ల కానుంద‌ని స‌మాచారం.

ఈ ప‌రిస్థితుల్లో ఇప్ప‌టికే టెలికం రంగంలో తీవ్రంగా న‌ష్ట‌పోయిన ఇత‌ర కంపెనీలు ఇప్పుడు డీటీహెచ్‌లోకి జియో ప్ర‌వేశిస్తే త‌మ‌కు క‌లిగే న‌ష్టం… దానిని అధిగ‌మించడం ఎలా అన్న‌దానిపై దృష్టి పెట్టాయ‌ట‌.

Loading...

Leave a Reply

*