ఊర్జిత్.. అంబాని మ‌ధ్య అదిరిపోయే బంధం.. అందుకే ఆ సీక్రెట్ లీక్ అయింది..!

ambani

నోట్ల ర‌ద్దు ప్ర‌క‌ట‌న వెలువ‌డిన త‌ర్వాత విశేషంగా ప్రాచుర్యంలోకి వ‌చ్చిన పేరు ఊర్జిత్ ప‌టేల్‌. మోడీ చ‌ర్య వివాదం అయ్యింది కూడా ఇత‌ని వ‌ల్ల‌నే. ఊర్జిత్ ప‌టేల్… అంబానీకి తోడ‌ల్లుడ‌ని, అత‌డి కంపెనీలో ప‌ని చేసిన ఆయ‌న ప్ర‌భుత్వ చ‌ర్య‌ల‌ను ముందుగానే అంబానీల‌కు చెప్పేశార‌ని సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం విస్తృతంగా జరుగుతోంది. ప్ర‌తిప‌క్షాలు కూడా ఇదే విష‌యాన్ని ఆరోపిస్తున్నాయి. ప్ర‌జ‌ల క‌ష్టాల‌కు తోడు, ఈ ప్ర‌చారం తోడ‌వ‌వ‌డంతో మోడీపై వ్య‌తిరేక‌త పెరిగిపోతోంది. అయితే, ఊర్జిత్‌కు సంబంధించిన ఆస‌క్తిక‌ర విష‌యాలు ఇవి… చ‌ద‌వండి… గుజ‌రాత్‌కు చెందిన ఊర్జిత్ ప‌టేల్‌ను మోడీ సొంత రాష్ట్ర అభిమానంతోనే ఆర్బీఐ గ‌వ‌ర్న‌ర్‌గా తెచ్చి పెట్టుకున్నారు. ఇక‌, ముకేశ్ అంబానీ భార్య నీతా అంబానీ చెల్లెల్ని ఊర్జిత్ చేసుకున్నాడ‌ని అలా వాళ్లిద్ద‌ద‌రూ తొడ‌ళ్లుల‌ని ఇప్పుడు జ‌రుగుతున్న ప్ర‌చారం.

నీతా అంబానీది గుజ‌రాత్ కావ‌డం దీనికి ఊత‌మిచ్చింది. నిజానికి నీతా అంబానీకి ఒక సోద‌రి ఉంది. అమె మ‌మ‌త ద‌లాల్‌. అమె ఇప్ప‌టికీ ముఖేష్ అంబానికి చెందిన ఒక స్కూల్‌లో ప‌ని చేస్తుంది. అయితే, నీతా అంబానీకి సోద‌రి వ‌ర‌స‌య్యే ఎవ‌రినైనా ఊర్జిత్ పెళ్లి చేసుకున్నారేమో అలా అంబానీతో బంధుత్వం క‌లిసిందేమో అనుకుందామ‌న్న సాధ్యం కాదు. కార‌ణం. ఊర్జిత్ ప‌టేల్ వ‌య‌సు ఇప్పుడు 53 ఏళ్లు. ఆయ‌న ఇప్ప‌టికీ బ్ర‌హ్మ‌చారి. పెళ్లే చేసుకోలేదు. ఇదీ సంగ‌తి ఊర్జిత్ గుజ‌రాత్‌కు చెందిన వాడు కావ‌డం… బ్ర‌హ్మ‌చారిగా ఉండ‌డం ఇంకా ప్ర‌పంచ బ్యాంకు స‌హా వివిధ ప్ర‌ఖ్యాత బాద్య‌త‌ల్లో ఆయ‌న స‌మ‌ర్థ‌వంతంగా ప‌నిచేయ‌డం వ‌ల్ల‌నే మోడీ ఆయ‌న‌ప‌ట్ల ఆక‌ర్షితుడ‌య్యారేమో.

Loading...

Leave a Reply

*