రావ‌ణాసురుడు బ్రాహ్మ‌ణుడా? ద‌ళితుడా?

ravanasurudu

ప్ర‌జ‌ల్లో నూటికి 99 శాతం ఆనందంగా ఉంటే ఒక్క శాతానికి న‌చ్చ‌దు.. ఏదో ఒక స‌మ‌స్య తెచ్చి అంద‌రికి మ‌న‌శ్శాంతి లేకుండా చేసి పండ‌గ పూట‌ ప‌రేషాన్ చేస్తేనే కానీ వాళ్ల శాడిజం సంతృప్తి చెంద‌దు… దీనికితోడు కోతికి కొబ్బ‌రికాయ దొరికిన‌ట్టు రేటింగుల మంట‌ల్లో పెట్రోల్ పోసి సామాజిక అశాంతి ర‌గిలిస్తుంటుంది ప‌నికిమాలిన మీడియా… దేశ‌మంతా స‌ర‌దాగా ద‌స‌రా పండ‌గ జ‌రుపుకుంటుంటే రావ‌ణాసురుడి కులం గుర్తుకువ‌చ్చింది కొంద‌రికి… ఎందుకంటే వాళ్లు కూడా రావణాసురుడిలా రాక్ష‌స సంత‌తి కాబ‌ట్టి… ద‌స‌రా సంద‌ర్భంగా విజ‌య‌ద‌శ‌మినాడు దేశంలో చాలాచోట్ల రావ‌ణ ద‌హనం చేస్తారు… అయితే ఇది త‌ప్పు అంటున్నాయి ద‌ళిత బ‌హుజ‌న సంఘాలు… రావ‌ణాసురుడు ద‌ళితుడు అని, త‌మ పూర్వీకుడు అని ఆయ‌న దిష్టిబొమ్మ‌ల‌ను ద‌గ్ధం చేస్తే తాము ఊరుకోబోమ‌ని హెచ్చ‌రిస్తున్నాయి ద‌ళిత సంఘాలు…అయితే హిందువులు నిప్పురా.. రావ‌ణుడ్ని కాల్చ‌రా అంటే అది త‌ప్పురా అంటున్నాయి ద‌ళిత సంఘాలు..

ద‌హ‌నమే అని హిందుత్వ‌వాదులు అంటుంటే స‌మ‌ర‌మే అంటున్నాయి ద‌ళిత సంఘాలు… ఇది పండ‌గ పూట పెద్ద గొడ‌వ‌గా మారింది… అయితే రావ‌ణాసురుడు ద‌ళితుడు, ద్రావిడుడు అనే వాద‌న‌ను ఖండిస్తున్నారు మేధావులైన పండితులు.. అస‌లు ఆర్య‌, ద్రావిడ సిద్ధాంత‌మే త‌ప్ప‌ని, అది ఉత్త‌ర‌, ద‌క్షిణ భారతాల‌ మ‌ధ్య చిచ్చు పెట్ట‌డానికి బ్రిటీష్ వాళ్లు ప‌న్నిన కుట్ర అని…. అంతేకాకుండా రావ‌ణాసురుడి విష‌యానికి వ‌స్తే ఆయ‌న ద‌ళితుడు కాద‌ని, బ్రాహ్మ‌ణుడే అని వాల్మీకి రామాయ‌ణంతో పాటు వేదాలు, పురాణాలు, ఇత‌ర ఇతిహాసాల ఆధారాల‌ను చూపిస్తున్నారు పండితులు.. రావ‌ణాసురుడి అస‌లు పేరు రావ‌ణ బ్ర‌హ్మ అని… ఆయ‌న బ్ర‌హ్మ‌కు ముని మ‌న‌వ‌డ‌ని రామాయ‌ణం చెబుతోంది… చ‌తుర్ముఖ బ్ర‌హ్మ‌కు కుమారుడైన పౌల‌స్త్య బ్ర‌హ్మ‌కు రావ‌ణుడు మ‌న‌వ‌డు…

అంటే ఆయ‌న బ్ర‌హ్మ‌దేవుడికి మునిమ‌న‌వ‌డు అవుతాడు… అంతేకాదు రావ‌ణుడి తండ్రి మ‌హా త‌ప‌స్సంప‌న్నుడైన విశ్ర‌వ‌సు రుషి… అంటే స‌దాచార స‌ద్బ్రాహ్మ‌ణుడు…. ఆయ‌న కుమారుడే రావ‌ణ బ్ర‌హ్మ‌… అయితే రావ‌ణుడు అంద‌రిని పీడించి హింసించి చంపి ఆనందించే గుణం క‌లవాడు కావ‌డంతో అంత‌టి గొప్ప‌వాడు కూడా బ్రాహ్మ‌ణుడి నుంచి రాక్ష‌సుడిగా మారిపోవాల్సి వ‌చ్చింది… అంటే తాను చేసిన దుర్మార్గాల వ‌ల్ల రావ‌ణ‌బ్ర‌హ్మ రావ‌ణాసురుడిగా మారిపోయాడు… ఇంకా చెప్పాలంటే రావ‌ణాసురుడికి పూర్వం రాక్ష‌సులు ఎలా వ‌చ్చారంటే….క‌శ్య‌పుడనే రుషికి ఇద్ద‌రు భార్య‌లు ఉండేవాళ్లు… ఒక భార్య పేరు దితి.. రెండో భార్య పేరు అదితి.. దితి సంతానమే దైత్యులు అంటే రాక్ష‌సులు… వాళ్లు క్రూర‌మైన మ‌న‌స్త‌త్వం క‌లిగిన‌వాళ్లు కాబ‌ట్టి రాక్ష‌సుల‌య్యారు… అదితి సంతాన‌మే దేవ‌తలు.. మంచి మ‌న‌స్త‌త్వం క‌లిగినవాళ్లు కాబ‌ట్టి వాళ్లు దేవ‌త‌ల‌య్యారు… అంటే రాక్ష‌సులు కూడా బ్రాహ్మ‌ణ మ‌హ‌ర్షి సంతాన‌మే…. ఇవీ వాస్త‌వాలు…

అయితే వీటిని వ‌క్రీకరించి బ్రాహ్మ‌ణుడైన రావణుడు ద‌ళితుడ‌ని కొంద‌రు… క్ష‌త్రియుడైన న‌ర‌కాసురుడు ద‌ళితుడని మ‌రికొంద‌రు వితండ వాద‌న‌లు, వి..తొండి వాద‌న‌లు వినిపిస్తూ హిందూ మ‌తంపై, హిందువుల పండ‌గ‌ల‌పై బుర‌ద జల్లేందుకు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి… కొంద‌రు ప‌నిక‌ట్టుకుని హిందూ మ‌తాన్ని, భార‌త దేశాన్ని, ఇక్క‌డి ప‌విత్ర గ్రంథాల‌ను ద్వేషిస్తూ… వాటిని అవ‌మానించేందుకు ఇలాంటి ప‌నికిమాలిన చేష్ట‌లు చేస్తుంటార‌ని, అలాంటి స‌న్నాసుల‌ను, వాళ్ల‌కు మ‌ద్ద‌తు ఇచ్చే మీడియా స‌న్నాసుల‌ను ప‌ట్టించుకోకుండా వ‌దిలెయ్య‌డ‌మే ఉత్త‌మమార్గం అంటున్నారు మేధావులు… కుక్క‌లు మొరిగినాయి క‌దా అని మ‌నం కూడా వాటితో స‌మానంగా మొరిగి ప‌రువు పోగొట్టుకూడ‌ద‌ని పెద్ద‌లు స‌ల‌హా ఇస్తున్నారు.

Loading...

Leave a Reply

*