షాకింగ్‌.. నిజం ఒప్పుకున్న పెప్సీ… కూల్‌ డ్రింక్ తాగితే అవి గ్యారంటీ అట…???

pepsi

కూల్ డ్రిండ్ దిగ్గ‌జం, ప్ర‌పంచ టాప్ ఫార్చూన్ కంపెనీల‌లో ఒక‌ట‌యిన పెప్సీగా తాజాగా సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. అంద‌రూ విస్తుబోయే వాస్త‌వాల‌ను కూడా బయ‌ట‌పెట్టింది. ఆ షాకింగ్ డెసిష‌న్ ఏంటంటే.. భ‌విష్య‌త్తులో తాము త‌యారు చేసే ఉత్ప‌త్తుల‌లో పంచ‌దార వినియోగాన్ని భారీగా త‌గ్గించాల‌ని నిర్ణ‌యించింది. ఈ విష‌యాన్ని అధికారికంగా ప్ర‌క‌టించ‌నున్నారు. రాబోయే ప‌దేళ్ల‌నాటికి అంటే 2015 నాటికి పెప్సీ ఉత్ప‌త్తుల‌లో రెండింట మూడొంతులు అంటే 100 కేల‌రీలలోపు ఉండేలా చ‌ర్య‌లు తీసుకోనుంది. అంతేకాదు, ఇప్పుడు వాడుతున్న చ‌క్కెన వినియోగాన్ని కూడా గ‌ణ‌నీయంగా త‌గ్గించ‌నున్నట్లు చెబుతున్నారు.

అంటే, ప్ర‌స్తుతం వినియోగిస్తున్న కూల్ డ్రింక్స్‌లో మార్పులు తీసుకువ‌చ్చి.. మ‌రిన్ని జీరో కేల‌రీ పానీయాల‌ను ప్ర‌వేశ‌పెట్టే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లు మార్కెట్ వ‌ర్గాలు చెబుతున్నాయి. స్థూలకాయుల్ని.. చక్కెర వ్యాధిగ్రస్థులను పెంచడంలో శీతలపానీయాల పాత్ర ఎక్కువగా ఉంటోందని ఆరోగ్య నిపుణులు.. ప్రభుత్వాలు విమర్శిస్తున్న నేపథ్యంలో పెప్సీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. అంటే, ఇన్నాళ్లూ విమ‌ర్శిస్తూ వ‌స్తున్న అనేక మంది ప్ర‌భుత్వ ఎన్‌జీవోల వ్యాఖ్య‌లు నిజ‌మేనేని, ఆ విష‌యాన్ని కూల్ డ్రింక్స్ కంపెనీలు కూడా ఆల‌స్యంగా అయినా ఒప్పుకున్నట్లుగానే ఉన్నాయ‌ని చెబుతున్నారు.

తాజా నిర్ణయానికి ముందు 2020 నాటికి తాము అమ్మకాలు జరిపే శీతలపానీయాల్లో చక్కెర వినియోగాన్ని 25 శాతానికి తగ్గించాలన్న లక్ష్యాన్ని పెప్సీ పెట్టుకుంది. గతంలో తీసుకున్న ఆ నిర్ణయంతో పోలిస్తే.. తాజా నిర్ణయం మరింత మెరుగైనదని మార్కెట్‌ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

Loading...

Leave a Reply

*